2021 సంక్రాంతి పోరు మామూలుగా ఉండేలా కనిపించడం లేదు. దాదాపుగా 2020 కరోనా కాలం కావడంతో 2020లో రావలసిన సినిమాలన్నీ 2021 కి వాయిదా పడ్డాయి సినీ పరిశ్రమకి 2020 ఏమాత్రము కలిసి రాలేదనే చెప్పాలి. ఎన్నడూ లేనంతగా సుమారుగా 7 నెలల పాటు సినిమా థియేటర్లు మూతపడడం జరిగింది.2020 సినీ పరిశ్రమకు ఇద్దరు బడా హీరోలు మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ సినీ పరిశ్రమకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. 2020 మొదట్లోనే భారత్లో కరోనా ప్రవేశించటం పూర్తిగా దేశం మొత్తం లాక్‌డౌన్‌ లోకి వెళ్లి పోవడం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి.

అయితే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. మరి మన తెలుగు సినీ పరిశ్రమ విషయానికొస్తే దాదాపుగా షూటింగ్ లేక ఏడు నెలల పాటు బడా హీరోలందరూ కరోనాకు భయపడి ఇంట్లోనే విరామం తీసుకుంటున్నారు. అందువల్ల సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఎన్నో సినిమాలు పూర్తయినప్పటికీ ను రిలీజ్ కి నోచుకోని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సినిమా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే అన్ని పరిస్థితులు సర్దుకున్నాయి. పూర్తిగా మునుపటి స్థితిలోకి రావాలంటే చాలా సమయం పడుతుంది. కేంద్రం అన్ లాక్ 5.0 చూపిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే హీరోలు వారి వారి షూటింగులకు వెళ్ళటం మొదలు పెట్టారు అయితే 2020లో రిలీజ్ కావాల్సిన సినిమాల లిస్టు పెద్దగానే ఉంది అయితే ఆ సినిమాలన్నీ కూడా ఈ సంవత్సరం విడుదల అయ్యే పరిస్థితి లేదు చిన్న సినిమాలు ఓ టి టి ప్లాట్ఫాం వైపు పరుగులు పెడుతున్నాయి అయితే పెద్ద సినిమాలు ఓటీటీ లో విడుదల చేయాలా.. లేక సినిమా థియేటర్ ల కోసం ఎదురు చూడాలా.. అన్న సందిగ్ధంలో ఉండిపోయాయి.

అందువల్ల 2021 సంక్రాంతిని చాలా సినిమాలు ముందుగానే బుక్ చేసుకుంటున్నాయి. అందులో మొట్టమొదటిది అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రామ్ నటించిన రెడ్, రానా నటించిన అరణ్య లాంటి సినిమాలు సంక్రాంతి కి రావాలని చూస్తున్నాయి. అయితే నితిన్ రంగ్ దే సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారట సినిమా నిర్మాతలు. అయితే ఈ సంక్రాంతికి కి లేని లోటు తీర్చడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సంక్రాంతి రేసులో ఉన్నట్టు సమాచారం ఆయన నటిస్తున్న రీఎంట్రీ మూవీ వఖీల్ సాబ్ సంక్రాంతికి వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నట్లు ఫిలిం నగర్ టాక్. మరి సంక్రాంతికి వచ్చే సినిమాల సంఖ్య పెరుగుతుందో లేక తగ్గుతుందో ఇంకొన్ని రోజులు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: