టాలీవుడ్ లో బోయపాటి శ్రీను కి ప్రత్యేకమైన శైలి ఉంది.. మాస్ సినిమా లకు కేరాఫ్ అడ్రెస్స్ గా బోయపాటి శ్రీను ని చెప్పుకోవచ్చు.. అయన సినిమా ఫలితాలు ఎలా ఉన్నా మాస్ ప్రేక్షకులకు పండగ చేసుకునే సీన్స్ లు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా బోయపాటి శ్రీను కు వినయ విధేయ రామ రూపంలో పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు.. మెగా ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన సినిమా అయినా ఇది కొంచెం కూడా వారికి నచ్చే విధంగా లేకపోవడంతో ఆ తప్పంతా బోయపాటి మీద నెట్టేసి ఆయనను తెగ విమర్శించారు.. సినిమా సంగతి ఎలా ఉన్నా యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం అదిరిపోయాయని చెప్పొచ్చు..

సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరీ బోయపాటి తనకు అచ్చి వచ్చిన బాలకృష్ణ తో సినిమా చేస్తున్నాడు..వీరి కాంబో లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమా లు సూపర్ హిట్ కాగా ఈ సినిమా పై కూడ మంచి అంచనాలున్నాయి.. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వచ్చాయి.. అయితే అవి ఒత్తి రూమర్స్ అని తేలిపోతున్నాయి.. ఎందుకంటే ఈ రూమర్ ఫై ఎలాంటి స్పందన హీరో నుంచి కానీ, డైరెక్టర్ దగ్గరినుంచి కానీ రాలేదు.. దాంతో విజయ్ సినిమా అనుమానమే అనిపిస్తుంది.

వినయ విధేయ తర్వాతే బోయపాటి కి హీరో లు దొరకడం కరువైంది..  ఆ సినిమా ఫలితం తర్వాత బోయ‌పాటితో సినిమా చేసే ధైర్యం చెయ్యట్లేదు. బాలకృష్ణ తర్వాత మ‌హేష్ బాబు తో బోయపాటి ఓసినిమా చేయాల‌నుకున్నాడు. కాక‌పోతే.. బోయ‌పాటి శైలి త‌న‌కు న‌ప్ప‌ద‌ని భావించిన మ‌హేష్ చాలా కాలం నుంచి బోయ‌పాటిని దూరంగా ఉంచుతున్నాడు. ప్ర‌భాస్ బోయ‌పాటికే కాదు.. ఎంత పెద్ద ద‌ర్శ‌కుడికైనా దొర‌క‌లేని ప‌రిస్థితి. బోయ‌పాటితో ట్యూన్ అవ్వ‌గ‌లిగింది, బోయ‌పాటి అడిగిన వెంట‌నే `సై` అనేది బ‌న్నీనే. కానీ.. బ‌న్నీ చేతిలోనూ చాలా ప్రాజెక్టులున్నాయి. అవ‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చేంత వ‌ర‌కూ. ఈ కాంబినేష‌న్ క‌ష్ట‌మే. దాంతో బాలకృష్ణ తో సెట్ అయిపోయాడు.. మరి ఈ సినిమా తర్వాత ఎవరు బోయపాటి తో చేయడానికి ముందుకు వస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: