మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా తరువాత చిరు చేయబోయే సినిమా పై కొంత అయోమయం నెలకొంది. వాస్తవానికి చిరు వివి వినాయక్, మెహర్ రమేష్, బాబీ సినిమాలను లైన్ లో ఉంచాడు.. అయితే వీటిలో ఏ సినిమా ఆచార్య తరువాత ఉంటుందనేది ఇంకా క్లారిటీ రాలేదు..  అయితే ముందు అనుకున్నట్లు చిరంజీవి తర్వాతి సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో ని లూసిఫర్ ని తెలుస్తుంది..

మెగా స్టార్ చిరంజీవి సినిమాల విషయంలో, కథ విషయంలో, డైరెక్టర్ ల విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటాడో అందరికి తెలిసిందే.. కథ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా ఆ సినిమా ని పక్కనపెట్టేయడంలో ఎలాంటి ఆలోచన చేయదు.. గతంలో పూరి జగన్నాధ్ లాంటి పెద్ద దర్శకుడిని పక్కన పెట్టిన ఘనత చిరు ది.  మలయాళ సినిమా లూసిఫర్ కి రీమేక్ కి మొదట్లో సుజిత్ దర్శకత్వం వహిస్తాడని వార్తలు రాగ స్క్రిప్ట్ విషయంలో సంతృప్తిగా లేని వినాయక్ కు ఛాన్స్ ఇచ్చారని వార్తలు వచ్చాయి.. అయితే వినాయక్ కూడా స్క్రిప్ట్ తో చిరు ని మెప్పించట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి..

మోహన్ లాల్ నటించిన ఈ మలయాళ సినిమా కి  మెగాస్టార్ సూచనలు, ఇన్ పుట్స్ కు అనుగుణంగా, చాలా వరకు మార్చి వినాయక్ కథను తయారు చేసిన చిరు ఆ కథను మెచ్చలేదని టాలీవుడ్ టాక్..ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయంలో అసంతృప్తి గా ఉన్నలు తెలుస్తుంది.. దాంతో వినాయక్ రచయిత ఆకుల శివ తో కలిసి `లూసీఫ‌ర్‌` ద్వితీయార్థం విష‌యంలో తీవ్ర క‌స‌రత్తులు చేస్తున్నారు..  తన రీ ఎంట్రీ లో చిరంజీవి అదరరగొట్టే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సైరా వంటి హిట్ తో టాప్ లో ఉన్న చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా లో నటిస్తుండగా ఇప్పటివరకు పరాజయం అన్నది తెలియని కొరటాల శివసినిమా కి దర్శకుడు.. సంక్రాంతి కి రిలీజ్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: