2020 కరోనా నామ సంవత్సరంగా గడిచిపోతోంది. సంక్రాంతి తర్వాత మార్చిలో థియేటర్స్‌ మూతపడ్డాయి. ఓపెన్ ‌చేసుకోవడానికి పర్మీషన్‌ ఇచ్చినా... ఎగ్జిబిటర్లు.. డిస్ట్రిబ్యూటర్స్‌ డేర్‌ చేసి తెరవలేకపోతున్నారు. మరి సినిమా సందడి ఎప్పుడంటే... ఇంకో రెండు నెలలు ఆగాల్సిందే. సినిమా సందడి ఎక్కడ ఆగిందో మళ్లీ అక్కడే మొదలవుతోంది. ఏడాది గ్యాప్‌ తర్వాత మళ్లీ సంక్రాంతినాడే థియేటర్స్‌ కళకళలాడనున్నాయి.

కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏడాది పాటు స్తబ్దత నెలకొంది. దసరాకు థియేటర్స్‌ తెరుచుకునేందుకు పర్మీషన్‌ వచ్చినా..ధైర్యం రిలీజ్‌ చేయడానికి నిర్మాతలు.. ఓపెన్‌ చేయడానికి ఎగ్జిబిటర్స్‌ సాహసం చేయలేకపోయారు. దీపావళికి కూడా ఇదే డైలమా కొనసాగే అవకాశం ఉంది. ఇక క్రిస్మస్‌కు ఒకటి రెండు సినిమాలు వచ్చినా.. హడావుడి నామమాత్రమే. అసలు సిసలు సినిమా సందడి చూడాలంటే 2021 సంక్రాంతి వరకు వెయిట్‌ చేయాల్సిందే.

ఓటీటీలో రిలీజ్‌ చేయాలా? థియేటర్స్‌లో విడుదల చేయాలా? అని ఊగిసలాడిన రామ్‌ ఎట్టకేలకు థియేటర్స్‌కే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. రామ్‌ డ్యూయెల్‌ రోల్‌ పోషించగా... కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్‌ నిర్మిస్తున్న రెడ్‌ మూవీకి ఓ ఓటీటీ సంస్థ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. కానీ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేయడానికి చిత్ర యూనిట్‌కు ఇష్టం లేదు. దసరా సందర్భంగా పోస్టర్‌ రిలీజ్‌ చేస్తూ.. సంక్రాంతిలో వస్తున్నామని తేల్చేశాడు నిర్మాత.

బ్యాలెన్స్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న రవితేజ క్రాక్‌ కూడా సంక్రాంతినే నమ్ముకుంది. ఈ ఏడాది దీపావళికి లేదంటే క్రిస్మస్‌కు వద్దామనుకున్న మాస్ ‌రాజా.. మనసు మార్చుకుని.. సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. ఈ పండుగ రేసులో చాలా సినిమాలు వున్నా... బాక్సాఫీస్‌ వద్ద ఫైటింగ్‌ చేయడానికి రెడీ అవుతున్నాడు క్రాక్‌. దసరా సందర్భంగా సంక్రాంతి రిలీజ్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌.

మొత్తానికి కరోనా దెబ్బకు థియేటర్లకు మూతపడ్డాయి. లాక్ డౌన్ తర్వాత.. అన్ లాక్ మార్గదర్శకాల్లో భాగంగా తిరిగి తెరుచుకున్నాయి. లాక్ డౌన్ సమయంలో థియేటర్లకు ఉండే క్రేజ్ నంతా ఓటీటీలు కొట్టేశాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: