ప్రస్తుతం కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 గడచిన మూడు సీజన్స్ కంటే కూడా మరింత జోష్ తో ముందుకు సాగుతోంది అనే చెప్పాలి. ఇక గత మూడవ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా చేస్తుండడం, అలానే కంటెస్టెంట్స్ కూడా ఎవరికి వారు ఎంతో తెలివిగా ఆడుతుండడం, ముఖ్యంగా బిగ్ బాస్ టీమ్, వారికి ఎంతో ఆకట్టుకునే విధంగా టాస్క్ లు ఇస్తుండడం వంటి అంశాలు ఈ తాజా సీజన్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగడానికి కారణాలుగా చెప్తున్నారు విశ్లేషకులు.

ఇక ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సీజన్లో గడచిన ఏడు వారాల్లో చాలా మంది హౌస్ మేట్స్ ఇంటి నుండి ఎలిమినేట్ కాగా, కొద్దిరోజుల క్రితం గంగవ్వ తన అనారోగ్య సమస్యల వలన హౌస్ పెద్ద అయిన బిగ్ బాస్ పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్లిపోవడం జరిగింది. ఇకపోతే ఈ బిగ్ బాస్ మొదటి సీజన్ నుండి కూడా పలువురు కంటెస్టెంట్స్ కు బయట ఎందరో ప్రేక్షకులు అభిమానులుగా మారి వారికి మద్దతుగా నిలుస్తూ ఓట్లు వేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి తొలి సీజన్ నుండి కొనసాగుతున్న ఈ సంప్రదాయంతో కొందరు ఏకంగా తమకు నచ్చిన కంటెస్టెంట్స్ పేరుతో ఆర్మీ లు పెట్టి వారికి జేజేలు కొడుతున్నారు.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ వారిలో కొందరు మాత్రం హౌస్ లోని పలు ఇతర హౌస్ మేట్స్ పై లేనిపోని విధంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారని, ఈ విధంగా కంటెస్టెంట్స్ పేరుతో ఆర్మీ లు పెట్టుకుని వారికి మద్దతు పలకడం బాగానే ఉన్నప్పటికీ, అది అడ్డం పెట్టుకుని ఇతర కంటెస్టెంట్స్ పై బురద చల్లడం సరైనది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి ఈ సీజన్ లో దాదాపుగా అందరు కంటెస్టెంట్స్ కు ప్రత్యేకంగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆర్మీ లు ఉన్నాయని, కాగా వారిలో చాలా మంది మంచి పద్దతిలో నడుస్తుంటే అక్కడక్కడా కొందరు మాత్రమే ఈ ఆర్మీ ల పేరుతో నెగటివిటీ క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: