టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సింహాద్రి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే భారీ సక్సెస్ ని అందుకున్న రాజమౌళి ఆ తర్వాత అక్కడి నుండి వరుసగా చేస్తున్న ప్రతి ఒక్క సినిమాతోనే సక్సెస్ ను అందుకుని కెరీర్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించారు. ఇటీవల ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు సినిమాలు కూడా ఎంతో గొప్ప విజయాలు అందుకున్న విషయం అందరికి తెలిసిందే.

కాగా వాటి అనంతరం ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్. రౌద్రం రణం రుధిరం పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని దానయ్య నిర్మిస్తుండగా రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా కనిపించనుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఇద్దరు హీరోల పాత్రలకు సంబంధించి రిలీజ్ అయిన పరిచయ టీజర్లకు ప్రేక్షకాభిమానుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇకపోతే రాజమౌళి సినిమాలకు సంబంధించి మొదటి నుంచి ఒక వాదన అయితే ప్రచారంలో ఉంది. ఆయనతో ఎవరైనా హీరో సినిమా చేస్తే ఆ సినిమా అత్యద్భుత విజయాన్ని అందుకోవడం ఖాయమని కాకపోతే దాని తర్వాత సదరు హీరో చేసే సినిమా మాత్రం సక్సెస్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే గతంలో కూడా పలువురు హీరోల సినీ కెరీర్ విషయంలో ఇది జరిగిందని, అలానే ప్రస్తుతం రాజమౌళి తో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ అలానే రామ్ చరణ్ లు దీనితో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అని, అయితే ఆ తర్వాత చేయబోయే సినిమాలతో మాత్రం ఫ్లాపులు అందుకునే అవకాశం ఉందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదంతా కేవలం యాదృచ్ఛికం మాత్రమే అని, నిజంగా సినిమా కథ, కథనాల్లో సరైన దమ్ముంటే తప్పనిసరిగా వారి తదుపరి సినిమాలు కూడా మంచి విజయాలను ఉంటాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: