నార్త్ మార్కెట్ కు సౌత్ టాలెంట్ సెట్ అవ్వదు అనుకున్నాడో.. లేకపోతే హిందీ ఆడియన్స్ ను సౌత్ మ్యూజిక్ డైరెక్టర్ మెప్పించలేడు అనుకున్నాడో ఏమో గానీ.. రాధేశ్యామ్ కు మాత్రం మల్టీ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సౌత్ వెర్షన్ కి ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఉత్తరాదికి మరో మ్యూజిక్ డైరెక్టర్స్ ని సెలక్ట్ చేస్తున్నాడు రెబల్ స్టార్.

ఒక సినిమా ఎన్ని భాషల్లో రిలీజ్ అయినా.. ఆ సిినిమా ట్యూన్స్ మాత్రం మారవు. కేవలం లింక్స్ మాత్రమే మారతాయి. కానీ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మాత్రం సౌత్, నార్త్ ఫార్ములా ఫాలో అవుతున్నాడు. దక్షిణాది ప్రేక్షకులను ఒక రకంగా, ఉత్తరాది ప్రేక్షకులను మరొక రకంగా ట్రీట్ చేస్తున్నాడు. రాధేశ్యామ్ మ్యూజిక్ లో ఈ విభజించు, మెప్పించు సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు బాహుబలి.

రాధేశ్యామ్ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. అయితే సౌత్ వెర్షన్ కు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ను, హిందీ వెర్షన్ కు మరో మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకుంటున్నాడు ప్రభాస్. దక్షిణాది రాధేశ్యామ్ కు తమిళ మ్యూజిక్ డైెరెక్టర్ జస్టిస్ ప్రభాకరన్ తీసుకున్న ప్రభాస్, ఉత్తరాది రాధేశ్యామ్ కి మాత్రం వేరే వాళ్లని తీసుకుంటున్నాడట. దీంతో ప్రభాస్ పై ట్రోలింగ్ మొదలైంది.

ప్రభాస్ సౌత్ ఆడియన్స్ ను ఒకరకంగా.. నార్త్ ఆడియన్స్ ను మరో రకంగా ట్రీట్ చేస్తున్నాడు. అందుకే సౌత్ కి జస్టిన్ ప్రభాకరణ్ ను తీసుకొని.. నార్త్ కు మాత్రం అక్కడి వాళ్లను తీసుకుంటున్నాడట. అంటే తమిళ మ్యూజిక్ హిందీ వాళ్లను మెప్పించలేడా.. లేకపోతే సౌత్ వాళ్లకు నార్త్ ట్యూన్స్ ఎక్కువనుకుంటున్నాడా..ప్రభాస్ ఎందుకీ వేరియేషన్స్ చూపిస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు జనాలు. మొత్తానికి ప్రభాస్.. ఎవరికి తగ్గట్టుగా వాళ్లను సెట్ చేసుకుంటూ తనదైన మార్క్ చూపిస్తున్నాడు.







మరింత సమాచారం తెలుసుకోండి: