ఇటీవల రామ్ హీరోగా తెరకెక్కిన ఈ ఇస్మార్ట్ శంకర్ సినిమా తో ఎట్టకేలకు ఎన్నో ఏళ్ల తర్వాత పెద్ద హిట్ అనుకున్నాడు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. అయితే దాని తర్వాత విజయ్ దేవరకొండ హీరో గా ఆయన తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా ఫైటర్. యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన పాత్ర అదిరిపోనుందని, అలానే ఈ సినిమా కోసం పలు రకాల యుద్ధవిద్యలు ఎంతో కష్టపడి విజయ్ నేర్చుకున్నాడని సమాచారం. బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని నటి చార్మితో కలిసి దర్శకుడు పూరితో ఎంతో ప్రతిష్టాత్మకంగా తన పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ముంబైలో జరుగుతున్నట్లు సమాచారం. ఇక అతి త్వరలో విదేశాల్లో కూడా తదుపరి షెడ్యూల్ జరుగుతుందని మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజిలో దర్శకుడు పూరి ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అప్ డేట్ రాకపోవడంతో విజయ్ దేవరకొండ అభిమానులు దర్శకుడు పూరి పై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే చాలా మంది హీరోల సినిమాలకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ లు ఎప్పటికప్పుడు వస్తున్నాయని, కానీ తమ హీరో సినిమాకి సంబంధించిన ఈ ఫైటర్ మాత్రం గురించి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అప్ డేట్ రాలేదని, కావున దర్శకుడు పూరి వీలైనంత త్వరగా ఫస్ట్ లుక్ కి సంబందించిన అప్ డేట్ ఇవ్వాలని కోరుతూ వారు కామెంట్స్ చేస్తున్నారు. మరి విజయ్ అభిమానులు కోరుతున్న విధంగా పూరి ఇకనైనా కనికరించి ఫైటర్ సినిమా కు సంబంధించి ఏదైనా అప్ డేట్ రిలీజ్ చేస్తారో లేదో తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: