దర్శక దిగ్గజం రాజమౌళి గురించి ప్రత్యేకించి తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ విదేశాల్లో ఉన్న ప్రేక్షకులకు కూడా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. తొలిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా మెగా ఫోన్ పట్టిన రాజమౌళి ఆ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్నారు. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన రాజమౌళి ప్రతి ఒక్క సినిమాతో విజయాన్ని అందుకొని తన కెరీర్లో అపజయం ఎరుగని దర్శకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించారు.

ఇక ఇటీవల ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్ గా తెరకెక్కిన బాహుబలి సిరీస్ లోని రెండు భాగాలు సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసి అద్భుత విజయాలు అందుకున్న రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ ని తీస్తున్నారు. ఇక తన సినిమాల కోసం అనుక్షణం ఎంతో కష్టపడి తపించిపోయే రాజమౌళి, తన సినిమాల యొక్క కథలోని బేస్ పాయింట్ ని మాత్రం మీడియా కు ముందే వెల్లడిస్తుంటారు. అలానే మొదటి నుండి తన సినిమాలకు సంబంధించిన అవసరమైన విషయాలు మాత్రమే వెల్లడించే అలవాటు ఉన్న రాజమౌళి తన సినిమాల సక్సెస్ ల అనంతరం నెలకొల్పిన రికార్డులు గురించి మాత్రం ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు.

ఇక సెట్ లో అందరితో ఎంతో కలుపుగోలుగా సరదాగా ఉంటూ శ్రమయేవ జయతే అనే పద్దతిని పాటిస్తూ ముందుకు సాగే మంచి మనస్తత్వం గల రాజమౌళి తన సినిమాలను ఎంతో సైలెంట్ గా తీస్తారని, అయితే ఆయన సినిమాలు మాత్రం వైలెంట్ గా బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు సాగుతుంటాయని, అందుకే కాబోలు బహుశా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటువంటి మాట రాజమౌళి వంటి గొప్ప వ్యక్తులను చూసి పుట్టిందేమో అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి రాబోయే రోజుల్లో ఇంకెంత గొప్ప విజయాన్ని అందుకొని ముందుకు దూసుకెళ్తారో తెలియాలంటే మరికొంత సమయం వరకు వెయిట్ చేయక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: