విజయ్ దేవరకొండ, సందీప్ వంగ కాంబినేషన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించింది షాలిని పాండే. ఆ సినిమాతోనే అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో విజయ్ తో అమ్మడు చేసిన రొమాన్స్ యూత్ ఆడియెన్స్ కు భీభత్సంగా నచ్చేసింది. హాట్ సీన్స్ లో కూడా ఎలాంటి మొహమాటం లేకుండా నటిస్తుంది కాబట్టి తెలుగులో అమ్మడికి తిరుగు లేదని అనుకున్నారు కాని అర్జున్ రెడ్డి తర్వాత అమ్మడికి ఆ రేంజ్ హిట్ ఒక్కటి పడలేదు సరికదా అనవసరంగా ఆమె కెరియర్ పాడు చేసుకుంటుందని అంటున్నారు.

రీసెంట్ గా వచ్చిన నిశ్శబ్ధం సినిమాలో షాలిని పాండే ఓ పాత్ర చేసింది. అసలు ఆమె ఆ రోల్ ఎందుకు చేసిందో ఆమెకైనా తెలియాలి. 118 సినిమాలో కూడా ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఇలా ఉంటే తమిళంలో ఆమె చేసిన 100% లవ్ రీమేక్ పర్వాలేదు అనిపించుకుంది. అక్కడ కూడా అమ్మడి కెరియర్ సోసో అన్నట్టుగా ఉంది. మరి అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ స్టార్ క్రేజ్ తెచ్చుకుని వరుస హిట్లతో దూసుకెళ్తుంటే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండే మాత్రం కెరియర్ లో వెనకపడ్డది.

తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదని బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ రెండు సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. మరి అమ్మడు ఇప్పటికైనా సరైన కథలతో సినిమాలు చేస్తే ఆదరించేందుకు రెడీగా ఉన్నారు. కథల ఎంపికలో క్లారిటీ మిస్ అవుతున్న షాకిని పాండేకి త్వరలోనే తెలుగులో మంచి ఛాన్సులు రావాలని ఆశిద్దాం.                                                   

మరింత సమాచారం తెలుసుకోండి: