ప్రభాస్ ‘రాథే శ్యామ్’ షూటింగ్ మళ్ళీ ఇబ్బందులలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. 10 రోజుల క్రితం యూరప్ వెళ్ళిన ప్రభాస్ అక్కడ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ జరిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూరప్ లో కరోనా సెకండ్ వేవ్ మొదలుకావడంతో యూరప్ లో అనేక చోట్ల కటిన నిబంధనలు అమలు చేయడమే కాకుండా చాలాచోట్ల మళ్ళీ కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలుస్తోంది.


‘రాథే శ్యామ్’ యూనిట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రోజుకు కేవలం మూడు లేక నాలుగు గంటల మించి షూటింగ్ చేయలేని పరిస్థితి ఏర్పడటంతో ఇక లాభం లేదనుకుని ప్రభాస్ తన యూనిట్ తో సహా వెనక్కు వచ్చేయాలని ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇప్పుడు ఈ విషయం హీరో నితిన్ వరకు చేరడంతో ఈ నెలాఖరుకు తన ‘రంగ్ దే’ మూవీ షూటింగ్ కోసం యూరప్ వెళ్ళాలి అనుకున్న నితిన్ ఆలోచనలలో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది.


తెలుస్తున్న సమాచారం మేరకు నితిన్ ఆలోచనలు ప్రస్తుతం దుబాయ్ వైపు ఉన్నట్లు టాక్. అయితే దుబాయ్ షూటింగ్ లకు సంబంధించి అక్కడి ప్రభుత్వం నుండి అనుమతులు రావడం చాల కష్టమైన పని. అందువల్ల ఎంతవరకు దుబాయ్ లో ‘రంగ్ దే’ షూటింగ్ కు పరిస్థితులు అనుకూలిస్తాయి అన్న సందేహాలు నితిన్ కు ఏర్పడినట్లు తెలుస్తోంది.


ఈ పరిస్థితులు ఇలా ఉంటే ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ మళ్ళీ డిసెంబర్ ప్రాంతానికి ఇండియాలో కూడ సెకండ్ వేవ్ వస్తుందా అన్న సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. అదే జరిగితే సంక్రాంతికి ధియేటర్లను ఓపెన్ చేసి సినిమాలను విడుదల చేయాలి అని ఆలోచిస్తున్న ఇండస్ట్రీ వర్గాల ఆలోచనలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. సంక్రాంతి కూడ సినిమాల విడుదల లేకుంటే జనం సినిమాలను చూసే అలవాటు శాస్వితంగా మర్చిపోయే ఆస్కారం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు భయపడిపోతున్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: