తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రమ్యకృష్ణ. ఒకప్పుడు కథానాయికగా వెండితెరను ఏలిన నటి రమ్యకృష్ణ. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో ఆమె దాదాపు 260 చిత్రాల్లో నటించారు. నీలాంబరిగా మారినా.. శివగామిగా రాజ్యాన్ని పాలించినా.. దేవతగా అవతారం ఎత్తినా.. రమ్యకృష్ణకే చెల్లింది. 1992 నుంచి 2000 వరకు పలు భాషల్లో తన అసమాన ప్రతిభతో ఓ వెలుగు వెలిగింది రమ్యకృష్ణ.  

ఇక కే.రాఘవేంద్రరావు చిత్రాలకు కేరాఫ్ రమ్యకృష్ణ అనేంతగా ఆయన దర్శకత్వంలో సూపర్‌హిట్ సినిమాలు చేసింది. ఆ సమయంలో కుర్రకారుకు రమ్యకృష్ణ స్వప్న సుందరి. తన హాట్ అందాలతో ఓ ఊపు ఊపేసింది తెలుగు వారిని. ఆ తర్వాత తల్లి, వదిన, పలు పాత్రల్లో నటించినా, బాహుబలి చిత్రాల్లో ‘శివగామి’ పాత్ర ఆమె నటనా కౌశలాన్ని ఖండాంతరాలకు విస్తరింపజేసింది ఆమె.

ప్రముఖ నటి, నిన్నటితరం కథానాయిక రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లోను ఏ మాత్రం దూకుడు తగ్గడం లేదు. ఇప్పటికీ సినిమాలు, సీరియల్స్, రియాలిటీ షోస్‌తో అదే జోరును కొనసాగిస్తూనే ఉంది. ఇక పవర్ ఫుల్ పాత్రలను మాత్రమే పోషిస్తోంది. పాత్రలో ఏదైనా విషయం ఉంటేనే ఆమె ఒప్పుకుంటోంది. అలాగే తన స్థాయికి తగ్గా పాత్రలకే ఓకే చెబుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో పవర్ ఫుల్ పాత్రకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

మెగా మేనల్లుడు సాయితేజ్ హీరోగా దేవా కట్ట దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రాజకీయ నేపథ్యంతో సాగే ఈ చిత్రాన్ని ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు తాజా సమాచారం. ఈ పాత్ర నెగటివ్ ఛాయలతో సాగుతుందని, హీరో పాత్రకు దీటుగా ఉంటుందనీ అంటున్నారు. ఇక ఇందులో సాయితేజ్ సరసన నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి 'రిపబ్లిక్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకమని, అందుకే సంగీత దర్శకుడిగా మణిశర్మని తీసుకున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: