గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో మెప్పించాడు అల్లు అర్జున్. తన పాత్ర పర్ఫెక్ట్ గా రాస్తే దానికి నూటికి నూరు పాళ్ళు న్యాయం చేయడంలో బన్నీ ది బెస్ట్ అనిపించుకుంటాడని మరోసారి గోన గన్నా రెడ్డి పాత్ర ద్వారా ప్రూవ్ అయ్యింది. గుణశేఖర్ ఈ పాత్ర కోసం ముందు ఎన్.టి.ఆర్ ని అడుగగా నిడివి పెంచమని అడిగాడని అందుకే ఆ ఛాన్స్ బన్నీకి ఇచ్చాడని తెలుస్తుంది.

ఇక లేటెస్ట్ గా బన్నీ శాంపిల్ గా చేస్తే సినిమా మొత్తం బాలయ్య చేయాలని ఫిక్స్ అయ్యాడు. గోన గన్నా రెడ్డి కథతో బాలకృష్ణ సినిమా ఉంటుందని తెలుస్తుంది. రుద్రమదేవిలో అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి పాత్ర సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఆయన కథతో బాలకృష్ణ హీరోగా సినిమా వస్తుందని అంటున్నారు. రుద్రమదేవిలో గోన రన్నా రెడ్డి పాత్రకు సూపర్ క్రేజ్ తెచ్చాడు బన్నీ మరి బాలయ్య బాబు ఆ పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.

గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత బాలకృష్ణ ప్రయోగాలకు పెద్ద పీట వేస్తున్నాడు. ఇంతకీ గోన గన్నా రెడ్డి సినిమాను ఎవరు చేస్తున్నారు. ఈ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఏంటన్నది తెలియాల్సి ఉంది. తప్పకుండా బాలకృష్ణ కూడా గోన గన్నా రెడ్డి పాత్రని అదరగొట్టేస్తాడని చెప్పొచ్చు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ త్వరలో ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.                                                                        
  

మరింత సమాచారం తెలుసుకోండి: