ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సామాన్యుడిగా సినీ రంగంలోకి వచ్చి స్వయం కృషితో ఎదిగి చిరంజీవి అయ్యాడు కొణిదెల శివశంకర శివ ప్రసాద్. ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఏదయినా ఉందా అంటే అది మాత్రం ఖైదీ సినిమా అనే చెప్పాలి. ఒక్కో సినిమా చిరు కెరీర్ ను ఒక్కో మలుపు తిప్పినా ఇది మాత్రం ఆయన కెరీర్ కు చాలా ప్లస్ అయిందని చెప్పచ్చు. స్టార్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అంటే అతిశయోక్తి కాదు.

ఎందుకంటే ఆయన కెరీర్ ని ఖైదీ ముందు ఖైదీ తర్వాత అని చెబుతారు. ఈ సినిమా అప్పటి వరకూ ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తుడిచి పెట్టేసింది. అంతే కాదు ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోగా నిలబెట్టింది. ఇప్పటికీ తెలుగు చలన చిత్ర చరిత్రలో కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమాకి చిరంజీవే ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. ఇక మనదగ్గర ఈ సినిమా అంత హిట్ కావడంతో ఈ సినిమాని ఇతర భాషల్లో కూడా తెరకెక్కించడానికి అక్కడి మేకర్స్ ఆసక్తి చూపించారు.

కన్నడంలో విష్ణువర్ధన్ హీరోగా, హిందీలో జీతెంద్ర హీరోగా ఈ సినిమాని రీమేక్ చేశారు. అయితే ఈ మూడు భాషల్లోనూ కథానాయికగా మాధవి నటించడం మరో విశేషం. ఈ సినిమాలో రగులుతోంది మొగలిపొద అనే పాట ఇప్పటికీ హాట్ ఫేవరేట్. ఆ సినిమా రిలీజయి నేటికి 37 ఏళ్ళు పూర్తి అయ్యాయి. దీంతో #37YearsForKhaidi అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: