మన తెలుగులో ఇప్పుడు కొంత మంది అగ్ర హీరోల సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉన్నారు. ప్రధానంగా చిరంజీవి సినిమాలు చేసే విషయంలో కాస్త ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆయన కొన్ని పాత్రల విషయంలో కూడా ముందడుగు వేస్తున్నారు. ప్రధానంగా తండ్రి పాత్రలో అదే విధంగా ఇతర పాత్రల్లో నటించడానికి చిరంజీవి ఆసక్తిగా ఉన్నారని ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది. తమిళంలో రజనీకాంత్ బాలీవుడ్ లో అమితాబచన్ ఇలాంటి పాత్రలు చేస్తున్నారు.

దీంతో చిరంజీవి కూడా వయసుకు తగిన విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఒక దర్శకుడి తో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఒక అగ్ర దర్శకుడి తో చిరంజీవి చర్చలు జరిపి ఒక పాత్ర చేయాలని ఉందని ఆ పాత్రకు సంబంధించి ఒక కథ కూడా రాయాలని ఆయన చెప్పారు. అయితే ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనే దానిపై క్లారిటీ లేకపోయినా ఈ సినిమా విషయంలో మాత్రం గోదావరి జిల్లాలకు చెందిన ఒక గ్రామ సర్పంచ్ గా చిరంజీవి నటించే అవకాశం ఉందని ఉంటున్నారు.

కోనసీమ జిల్లాలో ఒక గ్రామ సర్పంచ్ గా చిరంజీవి ఒక యువకుడికి తండ్రి గా నటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి ఆయన ఒక ప్లాన్ కూడా వేసుకున్నారట. అయితే ఈ సినిమా ఎందుకు చేస్తున్నారు ఏంటి అనే దానిపై స్పష్టత లేదు. కానీ ఈ సినిమా లో చేయాలని ప్రధానంగా చిరంజీవి చాలా కోరికగా ఉందని అందుకే ఆయన ఈ సినిమాను ముందుకు తీసుకుని వెళ్తున్నారు అని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ముందడుగు కూడా పడే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఎలా ముందుకు తీసుకువెళ్తారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: