టాలీవుడ్ లో కొంతమంది సీనియర్ హీరోలు అదేవిధంగా యువ హీరోలు ఎప్పుడు సినిమాల విషయంలో కాస్త ఎక్కువగానే జాగ్రత్త పడుతున్నారు. కొంత మంది సీనియర్ హీరోలు సినిమాలను విడుదల చేసే విషయంలో ఇప్పుడు కాస్త హుషారుగా లేరు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కొంతమంది దర్శక నిర్మాతలు మాత్రం సీనియర్ హీరోలతో సినిమాలు చేయడానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా నందమూరి బాలకృష్ణ సినిమాల విషయంలో కొంతమంది దర్శక నిర్మాతలు ఆసక్తి గా ఉన్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

బాలకృష్ణ సినిమాలకు బడ్జెట్ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయనతో సినిమాలు చేయడానికి కొంత మంది దర్శక నిర్మాతలు ఆసక్తి గా ఉన్నారని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే బాలకృష్ణ రెమ్యునరేషన్ విషయంలో కూడా పెద్దగా డిమాండ్ చేసే పరిస్థితి కనబడటం లేదు. దీనితోనే ఆయనతో ఓ సినిమా చేయడానికి కొంత మంది ముందుకు వస్తున్నారని వర్గాలంటున్నాయి. తాజాగా టాలీవుడ్ కి చెందిన ఒక అగ్ర నిర్మాత ఆయనతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా బాలకృష్ణ తో సినిమా చేయడానికి ఆయన ఒక బడ్జెట్ కూడా పెట్టుకుని ఆ బడ్జెట్ ని బాలయ్యకు అదేవిధంగా ఒక దర్శకుడికి కూడా వివరించారట. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో మొదలు పెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆ సినిమా విషయంలో ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమాలో కొన్ని పాత్రల విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టతకు కూడా చిత్రయూనిట్ రాలేదు అనేది టాలీవుడ్ వర్గాలు చెబుతున్న మాట. మరి ఎలా ముందుకు వెళ్తారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: