ఇటివలే రాజకీయాల్లోంచి కాస్త విరామం తీసుకొని.. మళ్ళీ సినిమాల్లోకి అడుగుపెట్టిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన అజ్ఞాత వాసి సినిమా పరాజయం తో సినిమాలకు పులిస్టాప్ పెట్టిన పవన్..ఇప్పుడు వరుస ప్రాజెక్టులను సైన్ చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న హిందీ రీమేక్ వకీల్ సాబ్ సినిమాతో  పాటు మరో రెండు ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టాడు పవర్ స్టార్.ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఇటీవల కాలంలో హీరోలందరూ సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ బాడీ చేసి.. వెండితెరపై ఆకట్టుకుంటున్నారు.

 మెగా హీరోల్లో కూడా కొందరు సిక్స్ ప్యాక్ బాడీతో సందడి చేశారు.అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడూ తన కెరీర్లో సిక్స్ ప్యాక్‌ కోసం ప్రయత్నించిన దాఖలాలు లేవు.ఈ విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవన్‌ను ప్రశ్నించగా.. ఆయన షాకింగ్ ఆన్సర్ చెప్పారు. `ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలంతా సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ, నాకు సిక్స్ ప్యాక్‌పై ఇంట్రస్ట్ లేదు. నేను ధైర్యం అనే బలం కోసం పని చేస్తాను. కండలు ఎవరైనా పెంచొచ్చు. కానీ గుండె ధైర్యాన్ని పెంచుకోవడం చాలా కష్టం. ఓ రాజకీయ నేతగానూ నేను ప్రజల్లోకి వెళ్లడానికి ఆ ధైర్యం చాలా అవసరం` అని పవన్ చెప్పుకొచ్చారు.

ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల కరోనా ప్రభావంతో వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది.మిగతా షూటింగ్ ని త్వరలో పూర్తిచేసి  ఈ సినిమా ను సంక్రాంతి కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక, నిర్మాతలు..ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమా షూటింగ్ లలో పాల్గొనబోతున్నాడు పవన్ కళ్యాణ్. ముందుగా క్రిష్ సినిమా పూర్తి చేసి... ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడట పవన్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: