నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యాం సింగ రాయ్. ఈ సినిమాకు సంబందించి ప్రీ లుక్ ఒకటి దసరా సందర్భంగా రిలీజ్ చేశారు. నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందిస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా మూడు జన్మల కథగా వస్తుందని టాక్. నాని ఈ సినిమాలో ఏకంగా మూడు పాత్రల్లో నటిస్తాడని తెలుస్తుంది.

ఈ సినిమాలో నాని మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. నాని ఈ మూడు పాత్రల్లో అదిరిపోయే రేంజ్ లో కనిపిస్తాడట. పాత్రల్లో వేరియేషన్స్ కూడా బాగా ఉంటాయని తెలుస్తుంది. మూడు జన్మల కథగా శ్యాం సింగ రాయ్ వస్తుంది. ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు రాహుల్ సంకృత్యన్.

తప్పకుండా నాని ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుతాడని అంటున్నారు. సితార ఎంటర్తైన్మెంట్స్ బ్యానర్ లో చేయాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. నాని కెరియర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు. నాని ఇప్పటికే జెంటిల్మెన్, కృష్ణార్జున యుద్ధం సినిమాల్లో డ్యుయల్ రోల్ చేశాడు. ఈ సినిమాతో కెరియర్ లో మొదటిసారి ట్రిపుల్ రోల్ ట్రై చేస్తున్నాడు. మరి నాని చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.                                                                   

మరింత సమాచారం తెలుసుకోండి: