నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటేనే దానిపై అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. సిం హా, లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న ఈ సినిమా నుండి మొన్నామధ్య వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. బిబి 3లో బాలయ్య డ్యుయల్ రోల్ లో కనిపిస్తారని తెలిసిందే. ఒక పాత్రలో బాలకృష్ణ అఘోరాగా కనీప్స్తారని టాక్. సినిమాలో బాలయ్య సరసన మళయాళ భామ ప్రగ్యా మార్టిన్ హీరోయిన్ గా నటిస్తుంది.

టైటిల్ ఇంకా రివీల్ చేయని ఈ సినిమాకు డిజిటల్ రైట్స్ భారీగా అమ్ముడయ్యాయి. 9 కోట్ల డిజ్టల్ రైట్స్ తో బిబి3 సత్తా చాటింది. ఇక ఇప్పుడు శాటిలైట్ రైట్స్ లో కూడా అదే దూకుడు చూపించిందని తెలుస్తుంది. జెమిని టివి బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ కాంబో సినిమా శాటిలైట్ రైట్స్ కొనేసిందట. బిబి 3లో నందమూరి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయని టాక్.

ఈ సినిమాలో విలన్ గా నవీన్ చంద్ర నటిస్తున్నాడు. తప్పకుండా నందమూరి ఫ్యాన్స్ ను మాత్రమే కాదు మాస్ ఆడియెన్స్ ను అలరించే అంశాలు ఈ సినిమాలొ ఉన్నాయని తెలుస్తుంది. బిబి 3 2021 సంక్రాంతికి రిలీజ్ అన్నారు కాని ఆల్రెడీ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది. టైటిల్ కూడా ఎనౌన్స్ చేయని ఈ సినిమా టైటిల్ ఇంకా టీజర్ కోసం ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.                                                                           

మరింత సమాచారం తెలుసుకోండి: