మన తెలుగులో సినిమాలు చేయడానికి ఇతర భాషల నటులు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా విజయ్ సేతుపతి ముందు వరుసలో ఉంటాడు. విజయ్ సేతుపతి ఎక్కువగా తెలుగులో సినిమాలు చేయడానికి కొంత మంది స్టార్ హీరోలతో కూడా స్నేహం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల భారీగా డిమాండ్ చేయడంతో అతని పక్కన పెట్టారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తే కొంత మంది సినీ నటులు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం.

ప్రధానంగా తెలుగులో సినిమాలు చేసే విషయంలో ఆయన భారీగా డిమాండ్ చేయడంతో కొంత మంది ఇబ్బంది పడుతున్నారు. దీనితో కొంత మందికి తగ్గిస్తున్నారు అనే భావన కూడా ఉంది. విజయ్ సేతుపతి కోసం భారీగా బడ్జెట్ కేటాయిస్తున్నారని దీనితో ఇతర నటులకు బడ్జెట్ తగ్గిస్తున్నారు అని దీని వలన తాము నష్ట పోతామని అంటున్నారు. ఆ బాధితుల్లో జగపతి బాబు కూడా ముందు వరుసలోనే ఉన్నారని సమాచారం. ఇటీవల మహేష్ బాబు సినిమాలో వీరిద్దరిని  కూడా తీసుకోవాలి అని దర్శక నిర్మాతలు భావించారు.

అయితే దాదాపుగా 7 కోట్ల వరకు విజయ్ సేతుపతి డిమాండ్ చేసారు అని సమాచారం. అయితే ఆయన కోసం జగపతి బాబు రెమ్యూనరేషన్ తగ్గించారని అంటున్నారు. అయితే తమిళంలో విజయ్ సేతుపతి మార్కెట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయనకు అంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. దీని వెనుక వాస్తవాలు ఏ విధంగా ఉన్నా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే మాత్రం కాస్త పరిస్థితులు ఇబ్బందికరంగానే ఉన్నాయి. విజయ్ సేతుపతిని పక్కన పెట్టాలని కొంతమంది  నటులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ విలన్ కూడా ఆయన విషయంలో కాస్త సీరియస్ అయ్యారని సమాచారం. మరి ఈ పరిస్థితులు ఎంతకాలం ఉంటాయి ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం తెలుగు సినిమాకు ఇబ్బందికరంగా నే ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: