రియల్ స్టార్ అని శ్రీహరి కి బిరుదు. నిజానికి శ్రీహరికి ఇది సహజ లక్షణంగా చెప్పాలి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం శ్రీహరి సొంతం. ఆయన చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆయన చాలా చిన్న పాత్రలతో తన కెరీర్ ప్రారంభించారు. పైగా ఎవరి ప్రోత్సాహం లేకుండా హీరో స్థాయికి ఎదిగాడు. ఇక శ్రీహరి డైలాగ్ డెలివరీ బాగుంటుంది. మంచి ఫిజిక్ ఉన్న నటుడు. ఇప్పటితరంలో శ్రీహరి లాంటి బాడీ బిల్డర్ మరొకరు లేరనే చెప్పాలి.

ఇవన్నీ ఇలా ఉంటే బాలక్రిష్ణ సొంత దర్శకత్వంలో నర్తనశాల‌ మూవీ కొంత తీసి ఆపేశారు. ఆ మూవీలో భీముడు పాత్రను శ్రీహరి పోషించారు. నిజానికి భీముడు అంటే అందరికీ ఎన్టీయార్ ముందు కళ్ళకు కనిపిస్తారు. ఆ తరువాత సత్యనారాయణ లాంటి వారు కూడా చాలా బాగా ఆ పాత్ర పోషించారు. మరి అటువంటి పాత్ర శ్రీహరిని వరించింది అంటే దానికి గల కారణాలను తాజాగా మీడియాతో మాట్లాడుతూ బాలయ్య పంచుకున్నారు. శ్రీహరి కి మంచి టాలెంట్ తో పాటు ఫిజిక్ కూడా ఉంది. అందుకే ఆయన్ని ఆ పాత్రకు తీసుకున్నానని చెప్పారు.

పైగా  శ్రీహరి చాలా మంచి మనిషి, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మనిషి అని కూడా బాలయ్య కితాబు ఇచ్చాడు. ఇక తాను శ్రీహరిని మొదటి నుంచి గమనిస్తూ వచ్చానని, ఆయనను తన సినిమాల్లో విలన్ గా కూడా అనేకసార్లు  సిఫార్స్ చేసేవాడిని అని కూడా బాలయ్య చెప్పారు. శ్రీహారి వంటి వారు ఇండస్ట్రీలో అరుదు అంటూ కితాబు ఇచ్చారు. తనకు సినిమా పరిశ్రమలో తక్కువ మంది మిత్రులు ఉన్నారు, వారిలో శ్రీహరి కూడా ఒకరు అని బాలయ్య చెప్పారు. శ్రీహరి కూడా  తన గురించి బాగా చెప్పేవారని బాలయ్య ఆనందం వ్యక్తం చేశారు. మొత్తానికి నర్తనశాల మూవీలోని కొన్ని కటింగ్స్ తో ఈ నెల 24న ఓటీటీ ద్వారా షార్ట్ మూవీగా రిలీజ్  చేసిన బాలయ్య దానికి ఆడియన్స్  నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెబుతున్నారు. ఇక నర్తనశాలను పూర్తి నిడివి సినిమాగా తీస్తాను అని కూడా ఆయన చెప్పారు.




మరింత సమాచారం తెలుసుకోండి: