నవదీప్ తేజా డిస్కవరీ. తేజా ఉదయ కిరణ్ తో పాటు, నితిన్ వంటి యువ నటులను అనేకమందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వారంతా మంచి సక్సెస్ తో రాణించారు. ఇక నవదీప్ కూడా చక్కని నటుడు, హీరోగా కొన్ని సినిమాల్లో వేశాడు. ఇక ఆ తరువాత సైడ్ హీరోగా కూడా వేస్తూ వచ్చాడు. విలన్ గా కూడా నవదీప్ నటించి తన సత్తా చాటుకున్నాడు. నవదీప్ అంటే యూత్ కి అదో రకం క్రేజ్ కూడా ఉంది. మంచి ఫిజిక్, బాడీ లాంగ్వేజ్  తో పాటు ఏ పాత్ర ఇచ్చిన దూసుకుపోయే తత్వం గల నటుడు అతను.

ఇక టాలీవుడ్ లో చూసుకుంటే నవదీప్ ఇంకా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలరే. నవదీప్ సహ నటులంతా కూడా పెళ్ళి చేసుకుంటున్నారు. కానీ నవదీప్ ఆ ఊసు లేకుండా కాలం వెళ్లదీస్తున్నాడు. మరి ఎందుకిలా అంటే దానికి ఆయన చెప్పిన జవాబు వింతగా విడ్డూరంగా ఉందిట. నవదీప్ ని ఆలీ ఒక ఛానల్  షో లో ఇంటర్వ్యూ చేశారు. ఆ షోలో ఆలీ అడిగింది ఇదే ప్రశ్న. నవదీప్ ఎందుకు పెళ్ళి చేసుకోలేదు అని ఆలీ అడిగేసరికి నవదీప్ ఎటువంటి తడబాటు లేకుండా ఆ అవసరం ఏంటో నాకు తెలిసిరాలేదు అని చెప్పాడు.

పెళ్ళి చేసుకోవడం అవసరం ఏముందో నాకు తెలియదు అన్నట్లుగా మాట్లాడాడు. మొత్తానికి చూస్తే టాలీవుడ్ లో ఒక్క నవదీప్ మాత్రమే కాదు చాలా మంది హీరోలు అలా ముదిరిపోతున్నారు. నిజానికి ఇది బాలీవుడ్ కల్చర్. అక్కడ‌ ఏజ్ బార్ అయినా పెళ్ళి కాని హీరోలు కనిపిస్తారు. మనకు కూడా మెల్లగా ఆ కల్చర్ వస్తున్నట్లుగా ఉంది. అయితే కరోనా వేళ లాక్ డౌన్ పీరియడ్ లో మాత్రం చాలా మార్పు కనిపించింది. రానా వంటి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్ పెళ్ళి చేసుకున్నాడు. అలాగే నితీన్ కూడా పెళ్ళి పీటలెక్కాడు. నిఖిల్ చేసుకున్నాడు. ఇక మెగా మేనల్లుడు సాయి తేజ్ కూడా పెళ్ళికి తయార్ అంటున్నారు. మరి నవదీప్ కూడా పెళ్ళికి సై అంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: