అవునూ.. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా సినిమా "శ్యామ్ సింగారాయ్". రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియా లో ఓ స్టోరీ లైన్ వైరల్ అవుతుంది. అయితే ఇంతకీ ఆ స్టోరీ ఏంటి? ఏ జోనర్? హీరోయిన్స్ ఎవరు? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. న్యాచురల్ స్టార్ నాని హీరోగా "టాక్సివాలా" మూవీ ఫేం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా "శ్యామ్ సింగరాయ్". అయితే ఈ నేపథ్యంలో సినిమా స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ తెగ హల్ చల్ చేస్తుంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే.. "ఇదొక పునర్జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తోన్న సినిమా అని తెలుస్తోంది. ఓ జన్మలో అనుకోకుండా చనిపోయిన నాని.. మరో జన్మ ఎత్తుతాడట. ఓ జన్మలో రచయిత, మరో జన్మలో దర్శకుడట. ఇదే అసలు కథ అట. శ్యామ్ ఒకరు, సింగరాయ్ ఒకరట. ఈ రెండు పాత్రలతో పాటు నాని 65ఏళ్ల ముసలాడి పాత్రలో కూడా కనిపించనున్నారని టాక్. అంతే మొత్తంగా నాని మూడు విభిన్న గెటప్స్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లను కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సాయి పల్లవి, "ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్లుగా ఫైనల్ చేయగా. మరో హీరోయిన్ కి కూడా చోటుందని.. ఆ పాత్రలో అదితిరావు హైదరి గానీ నివేదా థామస్ లాంటి వారిని తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. మరి యంగ్ డైరెక్టర్ రాహుల్ ఈ సినిమాను ఎంతవరకు హ్యాండిల్ చేస్తారో చూడాలి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్‌ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: