నటి అనుష్క ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తోంది. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయి ఒక్క తెలుగుకే పరిమితం అయిపోకుండా దక్షిణాది స్టార్ గా మారింది. మొదట ఈమె నాగ్ సరసన సూపర్ అనే సినిమా చేసింది. అనుకోకుండా పూరీ కళ్ళలో పడిన ఈమె సినిమా హీరోయిన్ అయ్యింది కానీ అంతకు ముందు ఆమె యోగా టీచర్ గా పని చేసింది.
భూమిక భర్త భరత్ ఠాగూర్ దగ్గర ఈమె యోగా నేర్చుకుంది. అంతే కాదండోయ్ ఈమె స్వయంగా ఒక స్కూల్ లో పిల్లలకు యోగా నేర్పించే ఎందుకు కూడా జాయిన్ అయింది. అక్కడ టీచర్స్ అందరితో దిగిన పిక్ ఇప్పుడు మీకోసం. అయితే ఆ తర్వాత ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పూరి జగన్నాథ్ ని కలిసింది. ఆమె ఆహార్యానికి ఫిదా అయిపోయిన పూరి ఆమెను నాగార్జున కు పరిచయం చేశాడు. నాగార్జునకు నచ్చడంతో వెంటనే ఆమెకు సూపర్ అనే సినిమాలో అవకాశం ఇచ్చేశారు. ఈ సినిమాలో చేసింది చిన్న పాత్రే అయినా ఆమె నటనకు మంచి పేరు వచ్చింది.
అలా ఆమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేసింది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస హిట్లు పడడంతో ఆమెకు వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఈ క్రమంలో ఆమెకు అరుంధతి లాంటి హిట్ పడడంతో ఆమె క్రేజ్ చాలా దూరం వెళ్ళింది. ఇక ఈ సినిమా అనంతఃరం ఆమెకు వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. ప్రస్తుతం మొన్ననే ఈమె నిశ్శబ్దం అనే సినిమా రిలీజ్ చేసి ప్రస్తుతానికి ఖాళీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: