అందాలతో కుర్రకారు మతిపోగొట్టేసింది.....

అందాల సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన కొత్త లుక్ తో కుర్రకారు మతిపోగొడుతోంది. పరుపుపై కూర్చొని మ్యాగజైన్ తిరగేస్తూ హొయలుపోయింది. అభిమానులకు కనువిందు చేస్తూ తన హాట్ లుక్స్ ని పంచుకుంది. తెల్లని టాప్, బూడిద రంగు షార్ట్ వేసుకొని కెమెరా కళ్ళని దోచేసింది. తాజా చిత్రాల్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి లైకులు అందుకొంటోంది. "మీరు అనుకున్నదే చేయండి. ప్రపంచం అంతా వద్దన్నా సరే" అనే టాగ్ లైన్ ని పోస్ట్ లకి జతచేసింది.  ఆ చిత్రాల్ని మీరూ ఓ సారి చూసేయండి.

మనసు పెద్దదే.....

ఎప్పుడూ ఫోటోషూట్ లతో బిజీగా ఉండే ఈ సుందరి తన వారికోసం సమయాన్ని కేటాయిస్తోంది. తన సిబ్బందిలో ఒకరికి కొత్త బ్రాండ్ కార్ ని బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించి దసరా పండుగ రోజున ట్రాఫిక్ పోలీస్ డ్రెస్ వేసుకొని పూజ సామగ్రి చేతిలో ఉంచుకొని రహదారి పక్కన నిల్చున్న వీడియో ఒకటి నెట్ లో హాల్ చల్ చేస్తోంది. జాక్వెలిన్ దయా గుణాన్ని నెటిజన్లు అందరూ మెచ్చుకుంటున్నారు.

షూటింగ్ కి హాజరవుతూ...

కరోనా మహమ్మారి కారణంగా  చిత్రీకరణలు అన్నీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అందరిలాగే జాక్వెలిన్ కూడా తన అభిమానులతో సామాజిక మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంది. షూటింగ్స్ మొదలవడంతో సిబ్బందితో కలిసి దిగిన సెల్ఫీని కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈమె ప్రస్తుతం పవన్ కృపలాని దర్శకత్వంలో భూత్ పోలీస్ సినిమాతో ప్రేక్షకులని అలరించనుంది. సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, యామీ గౌతమ్ నటిస్తోన్న ఈ చిత్రం హార్రర్ కామెడీ నేపథ్యంలో రానుంది. మిసెస్ సీరియల్ కిల్లర్, కిక్ 2 సినిమాల్లోనూ జాక్వెలిన్ నటించింది. సీరియల్ కిల్లర్ సినిమాని నెట్ ఫ్లిక్స్లో చూడొచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: