సమంతా అక్కినేని ఇటీవల ముంబైలో ఒక యాడ్ షూట్ కోసం హైదరాబాద్ నుండి బయలుదేరినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె దానికి ఊతం ఇచ్చేలాగా తన టీంతో తీసుకున్న కొన్ని సేల్ఫీలని కూడా పోస్ట్ చేసింది. ఇక ఆ పిక్స్ ఒకదానిలో ఆమె స్మోకీ ఐడ్ మేకప్‌ తో ఉండగా మరొకటి, ఆమె మాస్క్ తో ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తన స్టైలిస్ట్‌ తో కలిసి ఫోజులిచ్చింది. ఇక అక్కడే ఉన్న ఫోటో గ్రాఫర్ లు ఊరుకుంటారా ? వాళ్ళు కూడా కొన్ని ఫోటోలు క్లిక్ మానిపించారు.  

సమంతా చివరిసారిగా  96 తెలుగు రీమేక్ జాను అనే సినిమాలో కనిపించింది. ఈ సినిమా అంతగా ఆడలేదని చెప్పాలి.ఈ సినిమాకి  ముందు రిలీజ్ అయిన మిస్ గ్రానీ యొక్క తెలుగు రీమేక్ ఓహ్! బేబీ మాత్రం ఈమెకు నటిగా మంచిపేరు తెచ్చి పెట్టింది. ఈ నటి లాక్డౌన్ లో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది, తన భర్త నాగ చైతన్య మరియు తన కుక్క పిల్ల హాష్ లతో ఎంత ఆనందంగా గడుపుతున్నానో ఆమె రోజూ అప్డేట్స్ ఇస్తూ ఉండేది.

లాక్డౌన్ సమయంలో సామ్ టెర్రస్ వ్యవసాయం వంటి కొత్త విషయాల్ని జనానికి పరిచయం చేసింది. అంతే కాదు కొత్త ప్రీ లెర్నింగ్ స్కోల్ ఏర్పాటు చేయడంతో పాటు ఆమె సొంత దుస్తుల బ్రాండ్ ని కూడా లాంచ్ చేసింది. ఆమె ఒక హారర్ సినిమా ఒప్పుకుందని ఒకసారి, లేదని ఒకసారి ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ విషయం మీద ఆమె క్లారిటీ ఇస్తే కానీ ఏమీ చెప్పలేము.

మరింత సమాచారం తెలుసుకోండి: