టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తర్వాత కొణిదెల కుటుంబం నుండి వచ్చిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తొలి సినిమా అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి నుండి మొన్నటి అజ్ఞాతవాసి సినిమా వరకు టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న పవర్ స్టార్ తన కెరీర్లో ఎన్నో గొప్ప సక్సెస్ లు అందుకున్న విషయం తెలిసిందే. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా ద్వారా మళ్లీ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైన పవర్ స్టార్ దానితో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా వాటిలో వకీల్ సాబ్ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ని పూర్తి చేసుకోగా క్రిష్ సినిమా మాత్రం కేవలం రెండు షెడ్యూల్స్ మాత్రమే జరుపుకుంది. ఇక వీటి అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా అలానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాతో పాటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యువ దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వంలో కూడా పవర్ స్టార్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలన్నిటికీ సంబంధించి అధికారికంగా ప్రకటనలు రాగా అతి త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా పవన్ ఒక సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ గా అందరూ ఎదురు చూస్తున్న కాంబినేషన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఒక సినిమా గనక చేస్తే ఆ సినిమా అన్ని రికార్డ్స్ బద్దలుకొట్టి సరికొత్త అధ్యాయాన్ని లిఖించడం ఖాయం అంటున్నారు పలువురు ప్రేక్షకులు.

తొలిసినిమా భద్ర నుండి మొన్నటి వినయ విధేయ రామ వరకు తన సినిమాల్లో భారీ స్థాయిలో మాస్ ఎలిమెంట్స్ జొప్పించే అలవాటు గల బోయపాటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా భారీ యాక్షన్ సినిమా ఒకటి రాబోయే రోజుల్లో తీయాలని, అలానే వారిద్దరి కాంబినేషన్లో అది మంచి హిట్ కావాలని పలువురు పవన్ అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి నిజంగానే వారిద్దరి కాంబినేషన్లో ఎంతవరకు సినిమా వర్కవుట్ అవుతుందో తెలియాలంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి అని అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: