మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం పేరుతో తెలుగు సహా పలు ఇతర భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దాదాపు రూ. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల ప్రారంభం అవ్వగానే అతి త్వరలో దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించి వీలైనంత త్వరగా సినిమాని వచ్చే ఏడాది ప్రథమార్థంలోపు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తోందట ఆర్ఆర్ఆర్ యూనిట్.

ఇకపోతే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హీరోలైన రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర టీజర్, ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర  టీజర్లు రెండూ యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకాభిమానుల నుండి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ కొమరం భీమ్ టీజర్ కు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. కాగా ఆ వార్తని బట్టి టీజర్ లో ఎన్టీఆర్ గుండెలపై గమనిస్తే గాట్లు పడి ఉండడం, అలానే ఆయన తలపై రక్తాన్ని పోసుకుంటూ ఉండడం గమనించవచ్చు. అయితే అంతకుముందు సినిమాలో పులితో భారీ యుద్ధం సమయంలో ఆయన ఒంటిపై గాయాలవ్వడం, అలానే ఆ యుద్ధంలో పులిని చంపేసిన అనంతరం తన తలపై దాని రక్తం పోసుకోవడం జరుగుతుందని అంటున్నారు.

ఎంతో భీకరంగా పులితో ఎన్టీఆర్ సాగించే ఈ పోరాట దృశ్యాన్ని దర్శకుడు రాజమౌళి అత్యద్భుతంగా తెరకెక్కించారని టాక్. సినిమాలో కీలకమైన సన్నివేశాల్లో ఇది కూడా ఒకటి అని రిలీజ్ తర్వాత తప్పకుండా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తప్పకుండ్డ ఆ సినిమా రిలీజ్ తర్వాత గత రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టడం ఖాయం అని పలువురు నందమూరి, మెగా అభిమానులు అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొమరం భీమ్ టీజర్ కు సంబంధించి ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే ఆర్ఆర్ఆర్ రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: