త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అలవైకుంఠపురం' సినిమా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా 'పుష్ప'.. సుకుమార్సినిమా కి దర్శకుడు..ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిపోయే ఈ సినిమా  వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడో సినిమా కాగా మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకున్నారు.. రంగస్థలం లాంటి హిట్ కొట్టిన సుకుమార్ కి ఇది ఒక అగ్ని పరీక్ష ల మారిందని చెప్పొచ్చు..ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గరినుంచి సుక్కు కు ఏదీ కలిసి రావట్లేదు అని చెప్పాలి..

అన్ని బాగుంటే ఇప్పటికే మహేష్ బాబు తో సినిమా చేసి రిలీజ్ చేయాల్సి ఉండేది. కానీ విధి ఆడిన నాటకంలో మహేష్ సుకుమార్ కి హ్యాండ్ ఇవ్వడం సుకుమార్ తనకు అచ్చోచ్చిన హీరో అయిన అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సినిమా కి విలన్ సమస్య ప్రధానంగా ఉంది అని చెప్పొచ్చు.. మొదటినుంచి అనుకున్నట్లు సినిమా విలన్ పై రోజు కో పేరు వినిపిస్తుంది..  ఇప్పటికే ఈ సినిమా కి విజయ్ సేతుపతి ని విలన్ గా ఫిక్స్ చేయగా డేట్ సమస్య వల్ల ఆయన ఈ సినిమా కి దూరమయ్యారు..

ఇదిలా ఉంటె కరోనా తరువాత ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుపెట్టలేదు.. ‘పుష్ప’ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ. అంటే చిత్తూరు, కడప జిల్లాల పరిధిలోనే కథ నడుస్తుంది. సినిమాలో పాత్రధారుల యాస కూడా చిత్తూరుకు సంబంధించిందే ఉంటుంది. అలాంటపుడు సినిమా ఆ ప్రాంతంలో నడుస్తున్న భావన జనాల్లో కలిగించాల్సి ఉంటుంది. కానీ ఈ సినిమా షూటింగ్ గురించి ఇప్పటిదాకా వచ్చిన వార్తల్లో ఎక్కడా చిత్తూరు, కడప జిల్లాల ప్రస్తావన లేదు. సుక్కు అక్కడ చిత్రీకరణ చేయడని స్పష్టంగా జనాలకు అర్థమైపోయింది. కేరళ అని, వికారాబాద్ అని, మడ అడవులని, మారేడుమిల్లి అని, వైజాగ్ అని వేరే ప్రాంతాల పేర్లే వార్తల్లో ఉన్నాయి. ఈ చర్చ బాగా జరగడంతో జనాల్లో ఇది చిత్తూరు-కడప జిల్లాల పరిధిలో జరిగే కథ అన్న భావనే లేదు. సినిమాలో అలా చూపిస్తే కచ్చితంగా అథెంటిసిటీ సమస్య వస్తుంది. ఈ తరహా కథలకు అది చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: