నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. బిబి3 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది. మళ్ళీ్పున  ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం నుంచి ఫస్ట్ రోర్ గా టీజర్ రిలీజ్ అయ్యి అందరిని ఆకట్టుకుంది..ఈ టీజర్ లో పంచెకట్టులో మీసం మెలితిప్పుతూ మాస్ లుక్ లో బాలయ్య అలరించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం.

సింహ, లెజెండ్ లాంటి సినిమా ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. నిజానికి బాలకృష్ణ గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదనే చెప్పాలి.. ఎన్టీఆర్ రెండు పార్ట్ లు, రూలర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.. దాంతో మళ్ళీ తనకు అచ్చోచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను తో చేతులు కలిపాడు బాలయ్య.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.. త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..

ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఇతర దర్శకులతో సినిమా లు చేయడానికి సిద్ధమవుతున్నారు బాలకృష్ణ.. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ తనకు మనసుపడ్డ ఓ పాత్ర ను సినిమా గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు..  అల్లు అర్జున్ పోషించిన గోనగన్నారెడ్డి పాత్రను ఫుల్ సినిమా చేయడానికి బాలకృష్ణ నిర్ణయించుకున్నాడట..గోనగన్నారెడ్డి చరిత్రకు సంబంధించి ఎక్కువ ఆధారాలు అందుబాటులో లేవు. ప్రస్తుతం దీన్ని రీసెర్చ్ చేసేందుకు బాలయ్య ఓ టీమ్ ని సెట్ చేసినట్టు తెలిసింది. ఇదంతా అధికారికంగా బయటికి వచ్చిన ప్రకటన కాదు కానీ బాలయ్య దీని మీద ఆసక్తి చూపుతున్న మాట వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: