తెలుగులో చిన్న కథా చిత్రంగా విడుదలై భారీ హిట్ తో పాటుగా, భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఉయ్యాల.. జంపాల.. ఈ సినిమాలో రాజ్ తరుణ్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో మరో హైలెట్ అయిన పాత్ర సెకండ్ హీరోయిన్..ఈ పాత్రలో  పునర్నవి భూపాలం నటించింది. ఆ సినిమాతో పాపులర్ అయిన ముద్దు గుమ్మ ఒకటో రెండో సినిమాలలో తళుక్కుమంది.  ఆ సినిమాలు ఓ మాదిరిగా ఆకట్టుకున్నాయి. తర్వాత సినిమాలలో పెద్దగా కనిపించలేదు..



మా టీవిలో ప్రసారమైన సక్సెస్ ఫుల్ రియాలిటీ షో బిగ్ బాస్ 3 లో పాల్గొంది. ఆమె అందానికి ఆమె హాట్ లుక్స్ కు చాలా మంది అభిమానులు పెరిగారు. అలాంటిది ఆమె అందం. అయితే  బిగ్ బాస్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం కొనసాగించడం జరిగింది. ఆ ప్రేమ ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకుంది.దాంతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇద్దరు కలిసి చాలా షో లకు కలిసి వెళ్ళారు. ఇక యుట్యూబ్ లో వీరికి క్రేజ్ మాములుగా లేదు. యుట్యూబ్ జోడీగా బాగా ఫేమస్ అయ్యారు.



ఇది ఇలా ఉండగా ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేసింది. ఫైనల్లీ ఇట్స్‌ హ్యాపెనింగ్ అంటూ తనకు ఎంగేజ్‌మెంట్‌ అయిన విషయాన్ని ప్రకటించింది. ఈ ఫొటోలోనే ఆమె చేయిని మరో చేయి పట్టుకుని ఉంది. అయితే చెయ్యి కాస్త తెల్లగా ఉండటంతో రాహుల్ కాదని తెలుస్తుంది. మరి ఎవరిదై ఉంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. చాలా ఇంటర్వ్యూ లో ఇదే ప్రశ్న ఎదురైంది.. కానీ ఫ్రెండ్స్ అని కొట్టిపారేశారు.. ఏది ఏమైనా మరో టాలీవుడ్ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: