కరోనా, లాక్ డౌన్ సమయంలో ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో చాలా విషయాలు చెప్తున్నారు పూరి జగన్నాధ్. ఆయన చెప్పిన తర్వాతే చాలా విషయాలు అందరికీ తెలిసాయంటే అతిశయోక్తి కాదు. రీసెంట్ గా ఆయన ‘వర్క్’ గురించి చెప్పుకొచ్చారు. ‘పని చేయడానికి ఎవరూ బద్దకించొద్దు. ఆహారం, నిద్ర, కాలకృత్యాలు.. ఇవన్నీ పేద, ధనిక బేధాల్లేకుండా ఎవరికి వారు చేసుకోవాల్సిందే.. వీటికి పనోళ్లని పెట్టుకోలేం కదా. ఉద్యోగాలు చేసే వారిలో 90 శాతం మంది ఎప్పుడు శని, ఆదివారాలు వస్తాయా అని పని చేస్తారు. వీరంతా బద్దకస్థులు. ఇలా ఆలోచించేవారి కెరీర్ సవ్యమైన దిశలో వెళ్లనట్టే.’

‘మనసు వేరే దాని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఇష్టం లేకుండా పని చేస్తారు. జీతం తీసుకోవడం తప్ప వారు చేసేదేం ఉండదు. దీంతో ఇక్కడ యాక్టర్లు ఎక్కువైపోయారు. దయచేసి నటన మానేయండి. టై కట్టుకుని ఆఫీసుకు వచ్చి బిల్డప్ ఇస్తారు. వీరిని నమ్మి పని చేతిలో పెడితే యజమాని నష్టపోతాడు. దేవుడ్ని ప్రేమించినట్టుగా పనిని ప్రేమించండి. ఇంటి సమస్యలు ఎక్కువైపోవడం వల్ల ఇలా నటించేస్తున్నారు. ఇష్టమైన పని చేయండి. అందులోనే ఆనందం ఉంటుంది. మనం వర్క్ చేసే ప్లేస్ ప్లే గ్రౌండ్ అయిపోవాలి. ఇష్టంతో పని చేస్తే మీలో క్రియేటివిటీ పెరిగిపోతుంది’.

‘పని మానేస్తున్నా అంటే యజమాని బతిమాలేలా ఉండాలి. ఖాళీగా కూర్చోవడం ఎంత కష్టమైన పనో లాక్ డౌన్ నేర్పింది. నువ్వు బాగుండాలంటే దేశ చట్టాలను గౌరవించు. చివరగా.. ఇష్టమైన పని చేస్తే పని చేస్తున్నట్టు ఉండదు. ప్రతిరోజూ సెలవే’ అని చెప్పుకొచ్చారు. తన దగ్గర మరో పదేళ్ల వరకూ సరిపడా కథలు ఉన్నాయని ఆమధ్య చెప్పారు పూరి. ఇంతగా పని మీద శ్రద్ధ, ఇష్టం ఉండబట్టే పూరి డాషింగ్ డైరక్టర్ అయ్యారని చెప్పాలి’.


మరింత సమాచారం తెలుసుకోండి: