తెలుగు చిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. సీనియర్ నటుడు వెంకటేష్ తన కెరీర్ మొదటి నుండి కూడా పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటారు. తనకు సూటవుతాయనుకునే పాత్రలనే ఎంచుకుంటూ.. వాటిలోనే అభినయం పరంగా కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇటీవలి కాలంలో వయసుకు తగ్గా పాత్రలను.. హుందాగా వుండే పాత్రలను ఆయన ఎంచుకుంటున్నారు. అయితే  ఈ క్రమంలో త్వరలో ఓ సినిమాలో కాలేజీ లెక్చరర్ పాత్రను పోషించడానికి ఆయన రెడీ అవుతున్నారు.

విక్టరీ వెంకటేష్ చివరగా 'వెంకీమామ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే వెంకీ రీమెక్ సినిమాలను ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు కరోనా కారణంగా వెంకీ చిత్రాలన్నీ ఆగిపోయాయి. ఇక ప్రస్తుతం 'అసురన్' రీమేక్ 'నారప్ప' సినిమాలో నటిస్తున్నాడు వెంకీ. ఈ సినిమా 70శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనేది ఆసక్తిగా మారింది.

 'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి చక్కని చిత్రాలను రూపొందించి పేరుతెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆయన దర్శకత్వంలో వెంకటేశ్ ఓ చిత్రాన్ని చేయడానికి ఓకే చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న 'నారప్ప', 'ఎఫ్ 3' సినిమాల తర్వాత వచ్చే ఏడాది మధ్యలో ఇది సెట్స్ కి వెళ్తుందని సమాచారం. ఇక ఇందులో వెంకీ కాలేజీ లెక్చరర్ గా సరికొత్త గెటప్ లో కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన లెక్చరర్ గా కనిపించే క్లాస్ రూమ్, కాలేజీ సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా వుంటాయట. హార్స్ రేసెస్ నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందని, ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు నిర్మిస్తారని సమాచారం. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: