బిగ్ బాస్ సీజన్ 4 లో కింగ్ నాగార్జునకు బదులుగా అక్కినేని కోడలు సమంత హోస్ట్ గా దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. దసరా స్పెషల్ ఎపిసోడ్ లో సమంత హుశారైన యాంకరింగ్ తో అలరించింది. అయితే కేవలం దసరా ఎపిసోడ్ మాత్రమే కాదు మరో నాలుగు ఎపిసోడ్స్ సమంత హోస్ట్ గా చేస్తుందని అంటున్నారు. ఇందుకు గాను సమంత భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్.

పెళ్లయినా సరే సమంత తన ఫాం ఏమాత్రం కోల్పోలేదు. దసరా స్పెషల్ ఎపిసోడ్ సమంత రావడంతో బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు వచ్చిన క్రేజ్ ఏర్పడింది. మొత్తంగా 5 ఎపిసోడ్స్ కు సమంతతో డీల్ సెట్ చేసుకున్నారట. అయితే ఈ 5 ఎపిసోడ్స్ కు కలిపి మొత్తగా 2.1 కోట్లు రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. అంటే ఒక్కో ఎపిసోడ్ కు 40 లక్షల దాకా తీసుకుంటుందని టాక్. అంటే ఓ సినిమా తీసినంత రేటుని ఫిక్స్ చేసిందన్నమాట. 5 రోజుల డేట్ ను ఈ విధంగా డిమాండ్ చేయడం సమంత వల్ల మాత్రమే అయ్యిందని అంటున్నారు.

బిగ్ బాస్ హోస్ట్ గా సమంత మామకు తగ్గ కోడలు అనిపించుకుంది. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత జాను తర్వాత తెలుగులో సినిమా కమిట్ అవలేదు. నందిని రెడ్డి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తుందని అన్నారు. కాని అది ఇంతవరకు వర్క్ అవుట్ అవలేదు. బిగ్ బాస్ హోస్ట్ గా సమంత క్రేజ్ చూసి ఆడియెన్స్ కూడా షాక్ అవుతున్నారు. మొత్తానికి అక్కినేని కోడలు మరోసారి తన సత్తా చాటిందని చెప్పొచ్చు.                                               

మరింత సమాచారం తెలుసుకోండి: