మెగాసార్‌ చిరంజీవి 152వ సినిమా ఆచార్య కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ వచ్చే నెల నుండి పునః ప్రారంభం కాబోతుంది.  కరోనా కారణంగా మార్చి నెలలో నిలిచి పోయిన షూటింగ్ ను దాదాపు 8 నెలల తర్వాత పునః ప్రారంభించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం. అయితే చిరంజీవి వయసు రీత్యా ఈ సినిమా షూటింగ్ ను ఇన్నాళ్లు ఆపాల్సి వచ్చిందని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఇప్పటికే స్టార్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు పలువురు స్టార్స్ షూటింగ్ లను ప్రారంభించారు. కొరటాల తదుపరి సినిమాను చేయాల్సి ఉన్న కారణంగా చిరంజీవి మరీ ఆలస్యం చేయడం భావ్యం కాదని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా ఇప్పట్లో వదిలి వెళ్లి పోయే అవకాశం కనిపించడం లేదు. ఆ కారణంగా షూటింగ్‌ లు మొదలు అవుతున్నాయి. చిరంజీవి కూడా గత ఆరు ఏడు నెలలుగా ఎదురు చూస్తున్నారు. కాని ఇప్పట్లో షూటింగ్స్‌కు అన్ని విధాలుగా అనుకూల అంశాలు కలిగే అవకాశం లేదు. అయినా కూడా జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌ చేయబోతున్నారు.


సినిమా షూటింగ్ లో నవంబర్ 3వ వారం నుండి చిరంజీవి షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడని సమాచారం. చిరంజీవితో చేయాల్సిన సీన్స్ కు సంబంధించిన కొరటాల శివ ఏర్పాట్లు చేస్తున్నాడు. తక్కువ మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉండేలా టీమ్ జాగ్రత్తలు తీసుకుంటుందట. ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్నమైన గెటప్స్‌ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్రలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. చరణ్ కు జోడీగా రష్మిక మందన్న కూడా నటించే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: