బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యేవారికి ఎన్నో కఠిన నియమ నిబంధనలు బిగ్ బాస్ పెడతాడు. అదేవిధంగా ఈషోను హోస్ట్ చేసే వారికి కూడ చాల కండిషన్స్ ఉంటాయని అంటూ ఉంటారు. గతంలో నాని ఈవిషయం పై ఓపెన్ గానే స్పందించాడు. మరొకసారి స్టార్ మా యాజమాన్యం తనను పిలిచినా తాను బిగ్ బాస్ షోను హోస్ట్ చేయనని అప్పట్లో చెప్పాడు.

బిగ్ బాస్ సీజన్ 1 ను హోస్ట్ చేసిన జూనియర్ కూడా తరువాత షోలను హోస్ట్ చేయమని స్టార్ మా రాయబారాలు చేసినా జూనియర్ ఆశక్తి కనపరచలేదు అన్న కామెంట్స్ అప్పట్లో వచ్చాయి. అయితే నాగార్జున మాత్రం బిగ్ బాస్ షో విషయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొనక పోవడంతో తిరిగి సీజన్ 4 కు కూడ అతడే హోస్ట్ చేస్తున్నాడు.

అయితే సల్మాన్ ఖాన్ కమలహాసన్ లాంటి టాప్ సెలెబ్రెటీలు బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తున్నప్పుడు ఒక్క ఎపిసోడ్ కూడ మిస్ కాలేదు. నాగార్జున హోస్ట్ చేస్తూనే తన సొంత వ్యవహారాలూ చక్కపెట్టుకుంటున్నాడు. గతః సీజన్ లో నాగ్ తన షష్టిపూర్తి వంకతో బిగ్ బాస్ షోకు దూరం అయినప్పుడు ఆ లోటును రమ్యకృష్ణ తో భర్తీ చేసారు. ఇప్పుడు నాగ్ తన ‘వైల్డ్ డాగ్’ కోసం హిమాలయాలకు వెళ్ళడంతో తాను లేని లోటును తన కోడలు సమంత కొడుకు అఖిల్ చేత భర్తీ చేసే విధంగా ప్లాన్ చేసినప్పటికీ ఆ ప్లాన్ బుల్లితెర ప్రేక్షకులకు ఆనందం కలిగించినా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు మాత్రం నాగార్జున లేని లోటుతో అసౌకర్యానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


 నాగ్ ప్రతి వీక్ ఎండ్ లోను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయి వారిచేత గేమ్స్ ఆడిస్తూ వారి మధ్య వారికి తెలియకుండానే చిన్నచిన్న గ్యాప్ వచ్చే విధంగా సున్నితంగా కామెంట్స్ చేస్తూ వారిని రెచ్చగొట్టి ఆతరువాత వారిని గ్రిప్ లో పెట్టుకునే వాడు. అయితే ఈ విషయంలో సమంత ఫెయిల్ అయిందని హౌస్ మేట్స్ కూడ అభిప్రాయం కలిగింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలు నాగ్ దృష్టి వరకు వెళ్ళినట్లు ఉన్నాయి. ఈ వీకెండ్ షోకు నాగ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి ఈ షోకు హాజర్ అయి మళ్ళీ హిమాలయాలకు వెళతాడు అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: