పునర్నవి భూపాలం గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు  అనడంలో అతిశయోక్తిలేదు. ఉయ్యాల జంపాల అనే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన పునర్నవి... తన నటనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని  సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. కానీ తెలుగు బుల్లితెరపై ఎంతో క్రేజ్ సాధించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన పునర్నవి ఎంతగానో గుర్తింపు సంపాదించి తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలిగా మారిపోయింది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ జంటకి బాగా క్రేజ్ వుంది అన్న విషయం తెలిసిందే.




 ఇక ఎన్నో రోజుల పాటు తన అందంతో ఆటిట్యూడ్ తో  కూడా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న పునర్నవి భూపాలం బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో రోజుల పాటు కొనసాగింది. ఇక ఆ తర్వాత బయటకు వచ్చిన పునర్నవి భూపాలం ఒక పల్లెటూరు నేపథ్యంలో సాగే సినిమాల్లో కూడా నటించి ఎంతో మంది ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం అడపాదడపా సినిమా అవకాశాలు అందుకుంటూ తనని  తాను నిరూపించుకునేందుకు పునర్నవి భూపాలం ప్రయత్నిస్తుంది. ఇటీవలే పండుగ ఈవెంట్ లలో  కూడా స్పెషల్ గెస్ట్ గా  పునర్నవి వస్తూ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుంది.



 ఇన్ని రోజుల వరకు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన పునర్నవి మరికొన్ని రోజుల్లో అత్తారింట్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది . పునర్నవి పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా పునర్నవి వెల్లడించింది. ఫైనల్ ఇట్స్ హప్పెనింగ్ అంటూ సోషల్ మీడియాలో తెలిపింది పునర్నవి చేతిని పట్టుకుని ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలో తన ఫియాన్సీ  ముఖాన్ని మాత్రం చూపించలేదు పునర్నవి. దీంతో పునర్నవి కి కాబోయే వరుడు ఎవరు అని ప్రస్తుతం ఆసక్తికర చర్చ మొదలైంది.అయితే పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి చేసుకోబోతున్నారా  లేదా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందా  అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే మొన్నటివరకు పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ ని పెళ్లి చేసుకోబోతోందని..  వీరిద్దరికీ పెళ్లి ఫిక్స్ అయింది అని ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.. దీంతో ఈ ఇద్దరికీ పెళ్లి కాబోతుందని అనుకుంటున్నారు ప్రేక్షకులు. అయితే పునర్నవి పెళ్లి విషయంలో వరుడు రాహుల్ సిప్లిగంజ్ కాబోతున్నాడా లేకపోతే మరేదైనా సర్ప్రైస్ వుందా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: