టాలీవుడ్ హీరోల్లో కొంతమంది హీరోల పేర్లు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అందులో ప్రధానంగా నాగచైతన్య పేరు ఎక్కువగా ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. నాగచైతన్య సినిమాలు చేసే విషయంలో భార్య మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు అని అంటూ ఉంటారు. సినిమాలో భార్య ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుంది అనే భావనలో ఆయన ఎక్కువగా ఉంటాడని... దీనితోనే తన సినిమాల్లో ఎక్కువగా తీసుకునే విధంగా దర్శకనిర్మాతలకు సూచనలు చేస్తూ ఉంటాడు అని అంటారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా దాదాపుగా హిట్ అయిన సంగతి తెలిసిందే.

 ఆటోనగర్ సూర్య సినిమా మినహా దాదాపు అన్ని సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే తన సినిమాల్లో సమంతను పక్కన పెట్టే  విధంగా అతను ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు సినిమాల నుంచి తన భార్యను పక్కకు తప్పించి తాను వేరే హీరోయిన్ తో సినిమాలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అతని నుంచి ఒక కీలక అడుగు పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవల రెండు సినిమాల్లో తన భార్యను తీసుకునే విధంగా ప్లాన్ చేశాడు.

అయితే ఆ రెండు సినిమాల నుంచి ఆమెను తప్పించి మరో హీరోయిన్ ని తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. సమంత ఉండటం వలన తాను హైలెట్ అవ్వటం లేదు అనే భావనలో కూడా నాగచైతన్య ఉన్నాడని దీనితోనే భార్యను పక్కన పెడుతున్నారని కొంతమంది అంటున్నారు. గతంలో కంటే ఇప్పుడు సమంతా చాలా బాగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనితోనే ఆమెను పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సమంత రెండు సినిమాల్లో నటించే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళంలో కూడా ఓ సినిమాలో నటిస్తోంది అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: