బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో ఇపుడు మంచి ఎంటర్ టైన్మెంట్. ఇక వీకెండ్ అంటే మంచి క్రేజ్. ఎందుకంటే నాగార్జున హోస్ట్ చేస్తారు. దాంతో ఆ రెండు రోజులకూ వ‌చ్చే టీయార్పీ రేటింగ్ ఒక లెక్కలో ఉంటుంది. గతవారం నాగార్జున కులూ మనాలీలో సినిమా షూటింగులో ఉండడంతో అక్కినేని కోడలు సమంత వచ్చి మొత్తం షోని నడిపించింది. అయితే ఈ వారం ఆమె వస్తారా. లేక నాగార్జునే వస్తారా అన్నది ఇంకా తెలియలేదు.

అయితే బిగ్ బాస్ షో కి ప్రత్యేక విమానంలో నాగార్జున వచ్చి వీకెండ్ ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుని వెళ్తారని టాక్ అయితే నడుస్తోంది. నిజానికి దసరా షోకి కూడా నాగార్జున రావాలనే అనుకున్నారుట. కానీ విమానంలో రావడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సమంత చివరి నిముషంలో హోస్ట్ చేయాల్సివచ్చిందట.

ఇపుడు అంతా బాగానే ఉంది కాబట్టి నాగార్జున హోస్ట్ చేస్తారని అంటున్నారు. ఒక్క రోజు వస్తే చాలు వీకెండ్ రెండు రోజుల ఎపిసోడ్ ని నాగ్ షూట్ చేసి వెళ్తారని అంటున్నారు. దాంతో ఈ వీకెండ్ కి నాగార్జున వస్తారా అన్నది ఒక ఆసక్తికర పరిణామంగా మారింది. మరో వైపు చూసుకుంటే సమంతనే రానున్న రెండు ఎపిసోడ్స్ కి హోస్ట్ గా పెట్టి లాగించేస్తారని కూడా అంటున్నారు.

ఆమె దసరా ఎపిసోడ్ అదరగొట్టడంతో ఆమెనే కంటిన్యూ చేయాలని కూడా అనుకుంటున్నారుట. నాగ్ అక్కడ నుంచి వచ్చి  రిస్క్ చేసి మరీ వీకెండ్ ఎపిసోడ్స్ చేయాల్సిన అవసరం లేకపోవచ్చునని కూడా అంటున్నారు. ఏది ఏమైనా మామా. కోడలులో ఎవరో ఒకరు ఈసారి కనిపించి తీరుతారు అంటున్నారు. ఇదిలా ఉంటే ఈసారి ఎలినిమేషన్స్ మీద కూడా ఆడియన్స్ లో ఆసక్తి చాలా ఎక్కువగానే ఉంది. అమ్మ రాజశేఖర్, మొహబూబ్, మొనాల్ ఈ ముగ్గురూ డేంజర్ జోన్ లో ఉన్నారని అంటున్నారు. వీరిలో ఎవరో ఒకరు కచ్చితంగా ఇంటికి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తోందిట.




మరింత సమాచారం తెలుసుకోండి: