అక్కినేని నాగ చైతన్య నాగేశ్వర రావు మనవడిగా, నాగార్జున అబ్బాయిగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి మంచి పేరు సంపాదించాడు. తనదైన నటన తో అందర్నీ ఆకట్టుకుంటూ ఈ హీరో  సెపరేట్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. తాను హీరోగా మొదటి సక్సెస్ అందుకున్న సినిమా ' ఏ మాయ చేసావే ' సినిమా హీరోయిన్ సమంత మాయ లో పడి పోయాడు. మూడు మూళ్ళ తో ఈ జంట ఒకటయ్యారు. వీళ్లిద్దరి పెళ్లి మూడేళ్ల క్రితం ఇరు కుటుంబాల సమక్షంలో ఎంతో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసినదే.

ఇది ఇలా ఉండగా చిరంజీవి అడుగు జాడల్లో హీరోగా టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన రామ్ చరణ్.. తండ్రి తగ్గ తనయుడుగా రాణిస్తున్నాడు. పీక్‌లో ఉండగానే అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను ఐదేళ్లు ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నాడు. దేశమంతా మాట్లాడుకునేంత ఘనంగా ఈ పెళ్లి జరిపించారు ఇరు కుటుంబ సభ్యులు. రామ్ చరణ్.. ఉపాసన పెళ్లై ఎనిమిదేళ్లు అవుతున్న వీరిద్దరికి పిల్లలు లేరు. కానీ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి తోటి హీరోలకు ఇద్దరేసి పిల్లలు ఉన్నారు. చరణ్, ఉపాసన కి ఇంకా పిల్లలు లేక పోవడం నిజంగా హాట్ టాపిక్ గానే మారింది.  దీని వెనుక పెద్ద రీజనే ఉందని చాలా సందర్భాల్లో చెప్పారు .

సమంత పిల్లల డ్రెస్ ఫోటోలు చూపించి రీసెంట్‌గా వచ్చని యాడ్‌లో  వీరు క్యూట్‌గా ఉన్నారనడం.. చైతూ.. ఇపుడు అలాంటివేం ప్లాన్ చేయొద్దు అని  చెప్పడం.... ఇలా వీళ్ళు పేరెంట్స్ ఎప్పుడు అవుతారో  సమాధానం ఇచ్చేశారు. ఇలా రామ్ చరణ్ , ఉపాసన దంపతుల మాదిరే చైతన్య, సమంత కూడా సంతానం కోసం తొందర పడటం లేదనే విషయాన్ని యాడ్ రూపంలో ఇన్‌ డైరెక్ట్‌ గా ప్రతీ ఒక్కరికి చెప్పేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: