శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్‌ సమర్పణ లో 'దిల్‌' రాజు, శిరీష్‌  'వకీల్‌ సాబ్‌' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ తో చేసిన 'అజ్ఞాతవాసి' చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఈ చిత్రం లో నటిస్తున్నాడు. బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ 'పింక్‌' తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తున్నట్టు తెలిసినదే. ఈ చిత్రం రిలీజ్ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో రావాల్సిన సినిమా లాక్ డౌన్ వల్ల వెనక బడింది.

ఇది ఇలా ఉండగా వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ ని తెలుగు టెలివిజన్ టాప్ ఛానెల్స్ లో ఒకటైన జెమినీ టీవీ వారు సొంతం చేసుకున్నట్టుగా టాక్. కానీ వీళ్ళు ఒక కండిషన్ ని పెట్టారు. ఆ విషయం లోకి వెళితే... డిజిటిల్ స్ట్రీమింగ్ లేటు చేస్తామని, అందుకు ఓటీటిలతో మాట్లాడతామని హామీ ఇవ్వమని అడిగారంటున్నారు. ఎందుకంటే ఓటీటీల్లో కొత్త సినిమా రిలీజ్  అవ్వగానే ఫ్యామిలీ అంతా కలిసి చూసేస్తున్నారు అలానే  మధ్యలో యాడ్స్ కూడా లేవు, హెడ్ డీ క్వాలిటీ ఉండటం కలిసొస్తోంది. దీని మూలం గానే సినిమా రిలీజైతే పట్టించుకునే పరిస్థితి ఉండట్లేదు.

ఈ లాక్ డౌన్ లో  'భానుమతి రామకృష్ణ' , 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' టీవిల్లో కూడా ఆశించిన స్పందన లేదు. అందుకే  శాటిలైట్ మార్కెట్ పడిపోకుండా ఉండాలంటే ఈ కండీషన్ తప్పనిసరి అని వాళ్ళు  భావిస్తున్నారట. ఇక వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ ఎంతంటే.... రూ. 15 నుంచి రూ . 17 కోట్ల వరకు రేటు ఫిక్సైనట్లు వినపడుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ' పుష్ప ' శాటిలైట్ హక్కులు కూడా అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఇపుడు ఆ లిస్ట్ లో 'వకీల్ సాబ్' కూడా చేరినట్లైంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: