ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు తమ వద్ద పనిచేసే స్టాఫ్ కు.. అలాగే వారికి అత్యంత ప్రియమైన వారికి ఖరీదైన లగ్జరీ కార్లను గిఫ్టులుగా ఇస్తోన్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న నితిన్ .. ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుములకు కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. వరుస పరాజయాలతో ఢీలా పడిపోయిన నితిన్ కు.. ‘భీష్మ’ చిత్రం మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఇక మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తన జిమ్ ట్రైనర్ కు కారుని ప్రెజెంట్ చేసాడు.

గతంలో మహేష్ బాబు కూడా ‘శ్రీమంతుడు’ సినిమా టైములో దర్శకుడు కొరటాల శివకు అత్యంత ఖరీదైన కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. తాజాగా.. ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రంలో బ్యాడ్ బాయ్ సాంగ్ కు చిందేసిన జాక్వలిన్ ఫెర్నాండేజ్‌ కూడా ఈ లిస్టులో చేరిపోయినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే..గతంలోనే జాక్వలిన్ ఫెర్నాండేజ్‌, తన దగ్గర మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసే ఓ వ్యక్తికి ఓ కారును గిఫ్ట్ గా ఇచ్చిందట. ఇప్పుడు కూడా తన స్టాఫ్‌లో ఓ వ్యక్తికి ఓ లగ్జరీ కారుని గిఫ్ట్ గా ఇచ్చిందట.

జాక్వలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా కెరీర్ ను మొదలుపెట్టినప్పటి నుండీ ఆ వ్యక్తి ఈమె దగ్గరే పనిచేస్తుందట. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...







మరింత సమాచారం తెలుసుకోండి: