2009 లో వచ్చిన అవతార్ సినిమా మొదటి భాగం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.  ఎంతటి ప్రఖ్యాతిని పొందినదో అందరికీ తెలిసిందే.... అంత అద్భుతంగా, ఆశ్చర్యంగా తెరకెక్కించాడు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతున్నాయి ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సీక్వెల్స్ ను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు జేమ్స్. ప్రస్తుతం అవతార్ సినిమాకి రెండో భాగం షూటింగు దశలో ఉంది. మొదటి భాగం కంటే రెండవ భాగం మరింత వినూత్నంగా.... అద్భుతంగా ఉండబోతుందట. అవతార్  సినిమానా...!!! "అంతకుమించి" అనేటట్టుగా సన్నివేశాలను రూపొందిస్తున్నాడు డైరెక్టర్ జేమ్స్.

ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఉంది.. కేట్ విన్‌స్లెట్, క్లిఫ్ కర్టిస్, బ్రెన్ డన్ కవెల్ లాంటి టాప్ స్టార్స్ ఒకే తెరపై కనిపించబోతున్నారు. అందులోనూ వీరి సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉండనున్నాయట. అవతార్ సినిమా పార్ట్ 2 లో  "పండోరా" గ్రహాన్ని పూర్తిగా  కళ్ళకు కట్టినట్టు చూపెట్టబోతున్నారట... అందుకు తగ్గట్టుగా ఇప్పటికే సీన్స్ ప్రిపేర్ చేశారని తెలుస్తోంది.అలాగే నీటి అడుగు భాగంలో కూడా కొన్ని సీన్లు ఉంటాయట... ఎంతో విచిత్రమైన సన్నివేశాలతో నీటి అడుగున షూటింగ్ ఉండబోతుందట.

సినిమా షూటింగ్‌లో భాగంగా కేట్ విన్‌స్లెట్ నీటి అడుగున ఏకంగా ఏడు నిమిషాల 14 సెకెండ్ల పాటు ఊపిరి బిగపట్టి ఉందట. ఇది నిజంగా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఫ్రీ-డైవ్ కూడా నేర్చుకుందట. నీటి అడుగున షూటింగ్ చేస్తున్న ఫొటో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి చర్చనీయాంశమైంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం  డిసెంబర్ 16, 2022న విడుదల కాబోతోంది. మరి  ఈ రెండవ భాగం.... అంచనాలకు మించి ఆదరణను అందుకుంటుందని సినీ బృందం ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. మరి మొదటి అవతార్ కు మించి ఇది ఆకట్టుకుంటుందా...?

మరింత సమాచారం తెలుసుకోండి: