అవునూ.. హీరోయిన్ పూనమ్ బజ్వా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. అయితే చాలా రోజుల నుండే ఆమె ప్రేమ వ్యవహారంపై ఓ కన్నేసిన నెటిజన్లు కనిపెట్టలేకపోయారు. అయితే తాజాగా ఆమె తన ప్రియున్ని పరిచయం చేసేసింది.  ఇంతకీ అతనెవరు? ఏం చేస్తుంటాడు? వీరి ప్రేమ ఎపుడు మొదలైంది? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. తాజాగా హీరోయిన్ పూనమ్ బజ్వా తను ప్రేమలో ఉన్నట్లు వెల్లడిస్తూ.. ప్రియుడికి స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపింది.. "సునీల్‌ రెడ్డి.. మై రూట్స్‌, గ్రౌండ్‌, వింగ్స్‌. హ్యాండ్సమ్‌, అందమైన హృదయం ఉన్న నా లైఫ్‌ మేట్‌, సోల్‌ మేట్‌కు జన్మదిన శుభాకాంక్షలు.నీతో కలిసి ఉండే ప్రతి మూమెంట్‌ ఓ మ్యాజిక్‌లా ఉంటుంది. నీ జీవితంలో ప్రేమ, ఫన్‌, సంతోషం, ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. మాటల్లో చెప్పలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నా" అని పూనమ్‌ ప్రియుడిపై ఉన్న ఇష్టాన్ని వ్యక్తపరిచారు. అయితే ఆమె పోస్ట్‌కు ఫాలోవర్స్‌తోపాటు సినీ హీరో సందీప్‌ కిషన్‌, హీరోయిన్ కామ్నా జఠ్మలానీ, ఆర్తి చబ్రియా తదితరులు స్పందించారు. పూనమ్ బజ్వాకి బెస్ట్ విషెస్ చెప్పారు.
ఇదిలా ఉంటే.. పూనమ్ బజ్వా 2005లో "మొదటి సినిమా" అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత  ఈ మద్దుగుమ్మ… "బాస్‌", "పరుగు" తదితర చిత్రాలలో మంచి పాత్రలు పోషించింది. చివరిగా తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన "ఎన్టీఆర్ కథానాయకుడు" సినిమాలో గారపాటి లోకేశ్వరి పాత్రను పోషించింది. అయితే తాజాగా పూనమ్ తనకు కాబోయే భర్తను పరిచయం చేయడంతో ఆమె పోస్టులు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈరోజుల్లో సినిమా వాళ్ళ ప్రేమ వ్యవహారాలు ఎలా ఉన్నాయంటే.. ఈరోజు వారి పెళ్లి విషయం ప్రకటించి మళ్లీ రేపే కాన్సిల్ చేసుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే ఈమె కూడా అలా కాకుండా వీరి ప్రేమ పెళ్ళి వరకు  వెళ్లాలని కోరుకుందాం..

మరింత సమాచారం తెలుసుకోండి: