నందమూరి బాలక్రిష్ణ టైం అసలు బాలేదు. ఆయనకు ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం హిట్ కొట్టాడు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా హిట్ కొట్టిన ఆయన మళ్ళీ ఎప్పుడు హిట్ కొడతాడు అని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అందుకే ఆయన ఎన్నో కాంబినేషన్స్ ని పక్కన పెట్టి మరీ తనకు బాగా అచ్చివచ్చిన బోయపాటితో ఒక సినిమా చేస్తున్నాడు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బిబి3 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు బాలయ్య ఈ సినిమాకి డ్యూయల్ రోల్ చేస్తున్నాడని అలానే ఈ సినిమాలో ఒక పాత్రలో అఘోరా అని కూడా ప్రచారం జరుగుతంది.

ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన సింహ, లెజెండ్ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్స్ కూడా సాధించాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూడవ సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అన్ని సినిమాల లానే కరోనా కారణంగా వాయిదా పడ్డ సినిమా షూటింగ్ లు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు బిబి3 సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అవుతోందని బోయపాటి శ్రీను తన సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు కూడా.

అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటంటే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అప్పుడే అమ్ముడయిపోయాయని అంటున్నారు. అది కూడా భారీ రేట్ పెట్టి కొన్నరని అంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాని ఏకంగా పదకొండున్నర కోట్లకి కొన్నదట జెమినీ యాజమాన్యం. అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో నవీన్ చంద్రని కుర్ర ఎమ్మెల్యేగా చూపించనున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: