ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ తమవైపుకు తిప్పుకుని  టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది బిగ్బాస్ తెలుగు సీజన్ 4. మొదట్లో చాలా తక్కువమందికి తెలిసిన కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్ లోకి రావడంతో ఈ సారి బిగ్ బాస్ హౌస్ కి అంతగా క్రేజ్ రాదు అని అందరూ అనుకున్నారు. కానీ మునుపెన్నడూ లేని విధంగా బిగ్బాస్ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున మాయ చేస్తున్నారు అని చెప్పాలి. బిగ్ బాస్ లో  కూడా కొన్ని ప్రేమ జంటలను ఎక్కువగా క్లోజప్ లో  చూపిస్తూ ఉండడంతో ఇక ప్రేక్షకులూ మరింతగా ఆకర్షితులవుతున్నారు.



 ఇక బిగ్ బాస్ హౌస్ లో వారం రోజుల పాటు కంటెస్టెంట్స్ చేసే సందడి ఇక  వారాంతంలో రెండు రోజులపాటు హోస్ట్ నాగార్జున వచ్చి చేసే సందడి మామూలుగా ఉండదు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్నా నాగార్జున షూటింగ్ కారణంగా విదేశాలు వెళ్లడంతో ఇక బిగ్బాస్ వారాంతంలో హోస్టింగ్  ఎవరు చేస్తారు అని అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా అక్కినేని సమంత ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మామకు తగ్గ కోడలిగా సమంత తన హోస్టింగ్ తో  అదరగొట్టింది. సమంత రాకతో బిగ్ బాస్ కి మరింత క్రేజ్ పెరిగిపోయింది అని చెప్పాలి.




 సమంత తనదైన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులు అందరితో కామెడీని పంచుతూ ఎంతగానో ఆకట్టుకుంది. లోపల ఉన్న హౌస్మేట్స్ కూడా సమంతను చూసి షాక్ కి గురయ్యారు. ఇదిలా ఉంటే ఈ వారం బిగ్ బాస్ హోస్ట్ గా ఎవరు రాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వైల్డ్ డాగ్ షూటింగ్ లో భాగంగా విదేశాలకు వెళ్లినా కింగ్ నాగార్జున... బిగ్ బాస్ హోస్టింగ్  కోసం వస్తాడా.. లేదా ఈ వారం కూడా మళ్లీ అక్కినేని వారి కోడలు సమంత ఎంట్రీ ఇచ్చి అందరికీ ఫుల్ టైం ఎంటర్ టైన్మెంట్ పంచుతుందా  అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: