బిగ్ బాస్ సీజన్ 4లో ఈ వారం ఆరుగురు హౌజ్ మేట్స్ నామినేషన్స్ లో ఉండగా ఈ వారం హౌజ్ నుండి ఒకరు కాదు ఇద్దరు ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. బిగ్ బాస్ హౌజ్ లో ప్రస్తుతం 11 మంది హౌజ్ మేట్స్ ఉన్నారు. వారిలో ఈ వారం ఆరుగురు నామినేట్ అయ్యారు. అమ్మా రాజశేఖర్, అఖిల్, మోనాల్, మెహబూబ్, లాస్య, అరియానా నామినేషన్స్ లో ఉన్నారు వీరిలో ముగ్గురు డేంజర్ జోన్ లో ఉంటారని తెలుస్తుంది.

అఖిల్, లాస్య, అరియానా స్టాంగ్ కంటెస్టంట్స్ గా ఉన్నారు. ఇక ఈ ముగ్గురు సేవ్ అయ్యే ఛాన్సులు బలంగా ఉన్నాయి. ఇక డేంజర్ జోన్ లో మోనాల్, అమ్మా రాజశేఖర్ ఉన్నారు. అయితే మెహబూబ్ మొదట్లో కొద్దిగా అతి చేయగా ఇప్పుడు టాస్కుల్లో తన సత్తా చాటుతున్నాడు.

మూడు వారాలుగా మెహబూబ్ నామినేషన్స్ లో రాకుండా చేస్తున్నారు. అప్పటి నుండి అతని మీద ఆడియెన్స్ గురి పెట్టుకుని ఉన్నారు. దేవి నావల్లి ఎలిమినేట్ అయిన టైం లోనే మెహబూబ్ ఎలిమినేట్ కావాల్సింది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేట్ అయితే మాత్రం అమ్మా రాజశేఖర్, మెహబూబ్ లు రిస్క్ లో పడే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అయితే అఖిల్ మోనాల్ లను విడదీసే అవకాశం ఉంటే మాత్రం మోనాల్ ను కూడా ఎలిమినేట్ చేసే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఒక హౌజ్ మేట్ మాత్రమే ఎలిమినేట్ అయితే మాత్రం అమ్మా రాజశేఖర్ ఈ వారం హౌజ్ నుండి బయటకు రాక తప్పదని టాక్.                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: