టాలీవుడ్ సినిమా మేకర్స్  అసలు దేనికీ రాజీపడరని పేరు. గత రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ కెమెరా దేశాన్ని దాటేసింది. ఎక్కడో తొంగి చూస్తోంది. ఏవేవో దేశాలు చుట్టి వస్తోంది. నిజానికి భారతదేశం నిండా ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ సినిమా హైప్ పెంచుకోవడానికి కమర్షియల్ లుక్ ఇవ్వడానికి విదేశాల్లో  షూటింగ్ కూడా అతి కీలకమైన ఎలిమెంట్ అయింది. దాంతో ఇపుడు అందరూ సబ్జెక్ట్ డిమాండ్ చేస్తోంది అంటూ విదేశాల వైపు పరుగులు తీస్తున్నారు.

అన్నీ బాగుంటే ఫరవాలేదు కానీ ఇపుడు ప్రపంచాన్ని షట్ డౌన్ చేసేసి కరోనా కోరలు చాస్తోంది. నిజానికి కరోనా పీక్స్ కి వెళ్ళిన దేశంగా ఇటలీని చెప్పుకోవాలి. ఆ సమయంలో ప్రభాస్ రాధేశ్యాం సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఒక్కసారిగా మహమ్మారి వచ్చిపడడం అంతటా లాక్ డౌన్ విధించడంతో ప్యాకప్ చెప్పి మరీ ప్రభాస్ టీం అంతా మార్చిలో భారత్ కి  వచ్చేసింది. ఆ తరువాత  హైదరాబాద్ లో హోం క్వారంటైన్స్ లో ప్రభాస్ కొన్నాళ్ళు ఉన్నారు. ఇపుడు కరోనా అక్కడ తగ్గిందని భావించి కొద్ది రోజుల క్రితం ఇటలీ షూటింగ్ కి రాధేశ్యాం టీం బయలుదేరివెళ్ళింది.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా షూటింగ్ చేస్తున్నారు. అయితే అనుకోని ఉపద్రవంగా మళ్ళీ సెకండ్ వేవ్ ఇటలీ సహా చాలా దేశాలకు వ్యాపించిందిట.  అయితే అక్కడ ప్రభుత్వం ఇపుడు రాత్రి వేళల్లో పూర్తి లాక్ డౌన్ విధించింది.  దాంతో పగటి పూట మాత్రమే షూటింగ్ చేస్తూ రాత్రిళ్ళు ఆగుతున్నారట. త్వరలోనే  మొత్తం రోజంతా లాక్ డౌన్ పెట్టడానికి కూడా అక్కడి సర్కార్ పెద్దలు  సన్నాహాలు చేస్తున్నారుట.

ఇక కరోనా సెకండ్ వేవ్ కూడా భయంకరంగా ఉంటుందని అంటున్నారు. దాంతో ఎందుకొచ్చిన బాధ అనుకుంటూ రాధేశ్యాం టీం ప్యాకప్ చెప్పేసేందుకు రెడీ అవుతోందిట. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ చేసిన షూటింగ్ చాలు, మిగిలినది సెట్స్ లో చేసుకుందామని  కూడా డిసైడ్ అవుతున్నారుట. మొత్తానికి ఇటలీ నుంచి రాధ్యేశ్యాం టీం సేఫ్ గా  రావాలని  టాలీవుడ్ లో కూడా అంతా కోరుకుంటున్నారుట.


మరింత సమాచారం తెలుసుకోండి: