అవునూ.. ఆ లేఖ తను విడుదల చేసింది కాదట. కానీ అందులో రాసింది నిజమేనట. అయితే ఇంతకీ ఆ లేఖ ఏంటి? అందులో ఏం రాసి ఉంది? ఇంతకీ ఏం జరిగింది? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులుగా రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారని ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆ లేఖ తనది కాదని చెప్పారు. అయితే అందులో తన ఆరోగ్యం గురించి విషయాలు నిజమేనని చెప్పుకొచ్చారు. త్వరలోనే "రజనీ మక్కల్ మండ్రం" (ఆర్ఎంఎం) సభ్యులతో చర్చించిన తర్వాత ఓ అధికారిక ప్రకటన విడుదల చేస్తానని వెల్లడించారు రజినీ. అయితే ఇంతకీ వైరల్ అవుతున్న లేఖలో ఏముందంటే.. "2011లో రజనీకాంత్ కిడ్నీ వ్యాధి బారినపడడంతో సింగపూర్ లో వైద్యం చేయించుకున్నారని, అయితే 2016లో మళ్లీ కిడ్నీ సమస్య తిరగబెట్టడంతో ఈసారి అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్నారని.. అంతేకాదు, ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున, కిడ్నీ వ్యాధిగ్రస్తుడైన రజనీకాంత్ ఎంతమాత్రం బయట తిరగలేని పరిస్థితి ఉందని, ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా బయట తిరగడం సాధ్యం కాకపోవచ్చని.. కిడ్నీ మార్పిడి వల్ల రోగనిరోధక శక్తి కనిష్టస్థాయికి చేరిందని, ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే అవకాశం ఉన్నందున బహిరంగ సభల్లో పాల్గొనడం ప్రాణాలకే ముప్పు అని లేఖలో పేర్కొన్నారు.
ఇక రజినీకాంత్ సినిమాలా విషయానికి వస్తే.. ప్రస్తుతం మాస్ అండ్ యాక్షన్ సినిమాల దర్శకుడు శివ దర్శకత్వంలో "అన్నాత్తై" అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనా వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా కీర్తి సురేశ్, నయనతార కూడా నటిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్రేక్ పడింది. మళ్లీ ఎపుడు మొదలు పెడతారో తెలియాల్సి ఉంది. చూడాలి మరి చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న రజినీ కి ఈ సినిమా అయినా ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: