కరోనా వచ్చి మొత్తం సినీ పరిశ్రమను షట్ డౌన్ చేసి పారేసింది. ఎనిమిది నెలలుగా టాలీవుడ్ లో  సినిమా షూటింగుల సందడి పెద్దగా లేదు.  అక్కడక్కడ చిన్న సినిమాల షూటింగ్ స్టార్ట్ చేసినా సీనియర్ హీరోలు మాత్రం గుమ్మం కదలలేదు. ఇక అరవైలు దాటిన హీరోలు అయితే ఇప్పట్లో షూటింగులు లేవని కూడా చెప్పేశారు. అయితే అందరి కంటే ముందు షూటింగ్ కి వచ్చిన హీరోగా నాగార్జునను  చెప్పుకోవాలి. ఆయన కరోనా పీక్స్ లో ఉన్నపుడే జూలైలో  బిగ్ బాస్ సీజన్ ఫోర్ కి హోస్ట్ గా మారి  షూటింగ్ చేశారు. ఇక ఇపుడు నాగార్జున కులుమనాలీలో వైల్డ్ డాగ్ మూవీ  షూటింగులో పాల్గొంటున్నారు. దాంతో అందరూ నాగ్ డేరింగ్ ని మెచ్చుకుంటున్నారు.

ఇక ఇపుడు నందమూరి హీరో బాలక్రిష్ణ కూడా షూటింగ్ కి రెడీ అనేశారు. ఆయన కూడా దాదాపుగా ఎనిమిది నెలలు తరువాత షూటింగ్ కి రెడీ అయ్యారు. మార్చిలో బాలయ్య బోయపాటి సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. ఈ మూవీని నిజానికి కాశీలో చాలా పార్ట్ షూట్ చేయాలి. కానీ ఇపుడు కరోనా ఉండడంతో సెట్స్ వేసి షూట్ చేయాలని నిర్ణయించారట. ఇక కధలో కూడా కొన్ని మార్పులు కూడా తీసుకువస్తున్నారుట.

ఇదిలా ఉంటే సీనియర్లలో ఇక అందరి చూపు మెగాస్టార్ చిరంజీవి మీద ఉంది. ఆయన ఆచార్య మూవీ కూడా ఎనిమిది నెలల క్రితం కరోనా కారణంగా పెండింగులో పడింది. ఇపుడు అంతా షూటింగులకు రెడీ అవుతున్నారు కాబట్టి మెగాస్టార్ కూడా కదలాలేమోనని అంటున్నారు. ఆచార్య మూవీ షూటింగ్ ఇప్పటికి నలభై శాతం అయింది.  దాంతో ఇక మీదట ఆ సినిమా కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తే వచ్చే ఏడాది సమ్మర్ నాటికి సిధ్ధం అవుతుంది అంటున్నారు. మరి టాప్ హీరోలంతా వరసగా షూటింగ్ కి వస్తే మాత్రం మళ్లీ టాలీవుడ్ కలకళలాడడం ఖాయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: